వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్లో మళ్ళీ కరోనా కలకలం: ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XBB టెన్షన్.. ఎందుకంటే!!

|
Google Oneindia TeluguNews

మళ్లీ భారతదేశానికి కరోనా మహమ్మారి ఆందోళన పట్టుకుంది. కరోనా మహమ్మారి యొక్క కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB గా పిలవబడే వేరియంట్ వల్ల సింగపూర్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ వేరియంట్ కు సంబంధించి 10 నుండి 15 శాతం నమూనాలు కనిపించడం ఆందోళన కలిగిస్తుంది.

భారత్ కు ఒమిక్రాన్ ఉప వేరియంట్ ఎక్స్ బీబీ టెన్షన్

భారత్ కు ఒమిక్రాన్ ఉప వేరియంట్ ఎక్స్ బీబీ టెన్షన్


ఒమిక్రాన్ యొక్క BA.2.75 మరియు BJ.1 ఉప-వేరియంట్‌ల కలయిక అయిన XBB, ఆగస్టులో సింగపూర్ లో మొదటిసారి కనుగొనబడింది. అక్కడ కేసులలో పెరుగుదలకు ఈ వేరియంట్ కారణమైంది. ప్రస్తుతం ఇతర దేశాలలో కేసుల పెరుగుదలకు దారితీస్తున్న ఇతర ఉప వేరియంట్లు భారతదేశంలో కూడా ఉండడానికి అధిక సంభావ్యత ఉందని భావిస్తున్నారు. భారత్ లోనూ అనేక నమూనాలలో కొత్త వేరియంట్ల జాడలు కనిపించాయని చెప్తున్నారు.

 సింగపూర్ లో విజృంభిస్తున్నఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ బీబీ

సింగపూర్ లో విజృంభిస్తున్నఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ బీబీ

ప్రస్తుతం సింగపూర్లో విజృంభిస్తున్న ఈ వేరియంట్ గత వారంలో రోజుకు సగటున 7717 స్థానిక కేసులను నమోదు చేసింది. ఇక గత నెలలో రోజు వారి సగటు రెండు వేల కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. సింగపూర్‌తో పాటు, ఈ వేరియంట్ ఆస్ట్రేలియా, డెన్మార్క్, బంగ్లాదేశ్ , భారతదేశం, జపాన్ మరియు యుఎస్ వంటి దేశాల్లో కూడా ప్రబలుతుందని తెలుస్తుంది. ఇక ఈ వేరియంట్ పట్ల అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

అన్ని ఇతర ఉప వేరియంట్ లపై ఆధిపత్యం ప్రదర్శించే ఎక్స్ బీబీ

అన్ని ఇతర ఉప వేరియంట్ లపై ఆధిపత్యం ప్రదర్శించే ఎక్స్ బీబీ

XBB అన్ని ఇతర ఉప-వేరియంట్‌లపై ఆధిపత్యం చెలాయించే లక్షణాలను ప్రదర్శిస్తోందని గుర్తించారు. ఇది వ్యాధి నిరోధక వ్యవస్థను ఏమార్చే లక్షణం ఉన్న వేరియంట్ అని చెప్తున్నారు. అయితే ఈ వేరియంట్ తీవ్రమైన అనారోగ్యానికి కారణమైనట్టు ఎలాంటి ఆధారాలు లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ వేరియంట్ సోకిన వారు వ్యాక్సిన్లు తీసుకోకపోతే ప్రమాదంలో పడతారని, వ్యాక్సిన్లు తీసుకున్న వారికి ఎటువంటి ప్రమాదం ఉండబోదని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వేరియంట్ వల్ల వ్యాధి వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందని చెబుతున్నారు.

భారత్ కు ఎక్స్ బీబీ తో కొత్త భయం

భారత్ కు ఎక్స్ బీబీ తో కొత్త భయం

ఇటు భారతదేశంలోనూ కరోనా మహమ్మారి శాంతించింది అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇప్పుడు ఈ కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్ మళ్ళీ కలవరపెడుతుంది. దీపావళి పండుగ తర్వాత ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. వ్యాక్సిన్ బూస్టర్ డోసులు తీసుకోవటంతో పాటు కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు.

English summary
In India, the corona fear has again erupted. Omicron new variant XBB created tension. It is a matter of concern that this variant, which has caused an increase in cases in Singapore, is also appearing in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X