భారతదేశంలో కరోనా థర్డ్ వేవ్: దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా వైద్యులకు పాజిటివ్; కొత్త ఆందోళన
భారతదేశంలో కరోనా కేసులు ఉప్పెన కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1.16 లక్షల కరోనా కేసులు నమోదు కావడం దేశ ప్రజలను వణికిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశంలో ఇంత పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

1,000 మందికి పైగా వైద్యులకు, వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్
ప్రస్తుతం
దేశంలో
కరోనా
కేసుల
వ్యాప్తి
నేపథ్యంలో
కొత్త
ఆందోళన
నెలకొంది.
కరోనా
మహమ్మారికి
వైద్య
సేవలను
అందిస్తున్న
వైద్యులు
ప్రస్తుతం
కరోనా
బారిన
పడుతుండటం
ఆందోళన
కలిగిస్తుంది.
దేశవ్యాప్తంగా
అనేక
రాష్ట్రాలలో
వందల
సంఖ్యలో
వైద్యులు
కరోనా
మహమ్మారి
బారిన
పడ్డారు.
ఇప్పటివరకు
దేశవ్యాప్తంగా
వైద్యులు,
నర్సులు,
వైద్య
విద్యార్థులతో
సహా
1,000
మందికి
పైగా
కరోనావైరస్
మహమ్మారి
బారిన
పడ్డారు.
ఎక్కువ
మంది
వైద్యులు
కరోనా
మహమ్మారి
బారిన
పడిన
రాష్ట్రాల
విషయానికి
వస్తే

మహారాష్ట్రలో 290 మంది వైద్యులు, సిబ్బందికి పాజిటివ్
మహారాష్ట్ర దేశంలోనే అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. మహారాష్ట్రలో కరోనా కేసులు కంట్రోల్ లేకుండా నమోదవుతున్నాయి. ప్రస్తుతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వైద్యుల సంఖ్యలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 290 మంది రెసిడెంట్ వైద్యులు ఉన్నారు. వీరు గత మూడు రోజుల్లో కరోనా పాజిటివ్ బారిన పడ్డారు.

ఢిల్లీలో ఆరోగ్య సిబ్బందితో సహా 120 మంది వైద్యులకు కరోనా పాజిటివ్
దేశ రాజధాని ఢిల్లీలో కూడా వైద్యులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దేశ రాజధానిలో ఆరోగ్య సిబ్బందితో సహా 120 మంది వైద్యులు పాజిటివ్ పరీక్షించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో 50 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా 26 మంది సఫ్దర్‌గంజ్ ఆసుపత్రి నుండి కరోనా బాధితులుగా మారారు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో 38 మంది వైద్యులు, 45 మంది ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్ బారిన పడ్డారు. 20 మంది వైద్యులు హిందూరావు ఆసుపత్రి నుండి మరియు 7 మంది లోక్‌నాయక్ ఆసుపత్రి నుండి ఉన్నారు.

పంజాబ్, జార్ఖండ్, బీహార్ లో కరోనా బారిన పడిన వైద్యులు
పంజాబ్ రాష్ట్రం చండీగఢ్‌లో, సిబ్బందితో సహా 196 మంది వైద్యులు రెండు రోజుల్లో పిజిఐలో కరోనా మహమ్మారి బారిన పడ్డారు. జార్ఖండ్‌లోని రాంచీలో ఇప్పటివరకు దాదాపు 180 మంది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు కరోనావైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంతేకాదు బీహార్లోని పాట్నాలో ఇప్పటివరకు 200 మంది వైద్యులు మరియు విద్యార్థులు కరోనావైరస్ కు పాజిటివ్ పరీక్షించారు.

పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ లోనూ వైద్యులకు కరోనా.. దేశంలో కొత్త ఆందోళన
పశ్చిమ
బెంగాల్,
కోల్‌కతాలో
వైద్యులు,
నర్సులు
కోవిడ్
బారిన
పడిన
కేసులను
నివేదిస్తున్నారు.
నివేదికల
ప్రకారం,
70
మందికి
పైగా
వైద్యులు
మరియు
నర్సులు
పాజిటివ్
బారిన
పడ్డారు.
ఉత్తరప్రదేశ్
రాష్ట్రంలోని
లక్నోలో,
మేదాంతలో
25
మంది
వైద్య
సిబ్బందికి
కరోనా
మహమ్మారి
సోకింది.
ఇతర
జిల్లాల
నుండి
కూడా
ఎక్కువ
కరోనా
పాజిటివ్
కేసులు
ఉన్నట్లు
నివేదికలు
సూచిస్తున్నాయి.
మొత్తానికి
కరోనాపై
సాగిస్తున్న
పోరాటంలో
ముందు
వరుసలో
నిలబడి
యుద్ధం
చేస్తున్న
వైద్యులు,
ఆరోగ్య
కార్యకర్తలకు
కరోనా
సోకడం
ప్రస్తుతం
దేశవ్యాప్తంగా
ఆందోళనకు
కారణంగా
మారింది.