ప్రైవేటు ఆసుపత్రుల్లో అందుబాటులో కరోనా వ్యాక్సిన్: ధర ఫిక్స్: నో ఎక్స్‌ట్రా: అక్కడ ఫ్రీ
న్యూఢిల్లీ: ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ధరలను కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. డోసు ధరను నిర్ధారించింది. ఒక్కో డోసు ధరను 250 రూపాయలగా ఖరారు చేసింది. అన్ని రకాల పన్నులు, సర్వీస్ ఛార్జీలను ఇందులోనే కలిపారు. దీనికి మించి అదనంగా ఎలాంటి డబ్బులను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్‌ను రెండు డోసుల రూపంలో తీసకోవాల్సి ఉన్నందున.. ఈ రెండింటికీ కలిపి 500 రూపాయలను ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా వేస్తారు.
వ్యాక్సిన్ వేసే సమయంలోనే డబ్బులు కడితే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. వచ్చేనెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వ్యాక్సిన్ డోసు ధర 150 రూపాయలు. ఇందులోనే ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన సర్వీస్ ఛార్జీని కలిపారు. 100 రూపాయలను సర్వీస్ ఛార్జీగా కట్టాల్సి ఉంటుంది. ఫలితంగా దీని ధర ఒక్కో డోసుకు 250 రూపాయలుగా నిర్ధారించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా వేస్తారు.

మార్చి 1వ తేదీ నుంచి 60 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వారు వ్యాక్సిన్‌ను వేయించుకోవచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అలాగే- 45 సంవత్సరాలు దాటి వేర్వేరు వ్యాధులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేషెంట్లకు కూడా వ్యాక్సిన్ వేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా అన్ని ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ప్రభుత్వ ఆసుప్రతుల్లో నిరుపేదలకు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేసే సౌకర్యాన్ని కల్పించినందున.. దాన్ని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత ఉన్న వారికి ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ దాన్ని అందుబాటులోకి తీసుకుని రావాలంటూ అందిన విజ్ఙప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద పేర్లను నమోదు చేసుకున్న 10 వేలకు పైగా ప్రైవేటు ఆసుపత్రుల్లో తొలిదశలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో ప్రైవేటు ఆసుపత్రులకు కూడా భాగస్వామ్యాన్ని కల్పించాలని నిర్ణయించామని అన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications