వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: CMO ఉద్యోగులకు కరోనా ? సీఎం జంప్, ఇప్పటికే సచివాలయంలో, అధికారులకు హడల్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) కాటుకు సామాన్య ప్రజలతో పాటు అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు హడలిపోతున్నారు. నువ్వానేనా అనే తేడా లేకుండా నేడు కరోనా వైరస్ దెబ్బకు ప్రాణ భయంతో హడలిపోతున్నారు. ఇటీవల తమిళనాడు సీఎం కార్యాలయం (CMO) అధికారి కరోనా వ్యాధికి బలి అయ్యారు. ఇప్పుడు మరో సీఎం అధికారిక నివాసంలోని ముగ్గురు అధికారులకు కరోనా వైరస్ సోకిందని ? వెలుగు చూడటంతో అందరూ హడలిపోయారు. క్షణాల మీద అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్న సీఎం తన మాకం మార్చేయడంతో CMO కార్యాలయం సిబ్బందితో పాటు ప్రభుత్వ అధికారులు కరోనా వైరస్ దెబ్బకు హడలిపోతున్నారు.

అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !అత్త కూతురితో పెళ్లి: ఫస్ట్ నైట్ బెడ్ రూంలో అరుపులు, కేకలు, సరసాలు కాదు, గడ్డపారతో మానవ మృగం !

సీఎంఓ కార్యదర్శి మృతి

సీఎంఓ కార్యదర్శి మృతి

తమిళనాడులో ఇప్పటికే 50 వేలకు పైగా కరోనా వైరస్ వ్యాధి కేసులు నమోదయ్యాయి. ఇక చెన్నైలో 35 వేలకు పైగా కరోనా కేసులు నమోదైనాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సైతం కరోనా దెబ్బకు హడలిపోతున్నారు. కరోనా వైరస్ కేసులు భారత్ లో నమోదైనప్పటి నుంచి తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఇంత వరకు ముఖానికి మాస్క్ తియ్యలేదు. రెండు రోజుల క్రితం తమిళనాడు CMO కార్యాలయం కార్యదర్శి దామోదరన్ ప్రాణాలు కరోనా వైరస్ వ్యాధి దెబ్బకు గాలిలో కలిసిపోయాయి.

ఇప్పుడు కర్ణాటక

ఇప్పుడు కర్ణాటక

కర్ణాటకలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతుండటంతో అక్కడి బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే కర్ణాటక ప్రభుత్వం కరోనా కట్టడిలో పర్వాలేదని అనిపించుకుంటోంది. అయితే ఇప్పుడు కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప కూడా కరోనా వైరస్ దెబ్బకు ఉలిక్కిపడ్డారని తెలిసింది.

CMOలో కరోనా వైరస్ ?

CMOలో కరోనా వైరస్ ?


బెంగళూరులోని ఆనంద్ రావ్ సర్కిల్ సమీపంలోని కృష్ణలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఆయన అధికారిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు కృష్ణలో సీఎం బీఎస్. యడియూరప్ప అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే కర్ణాటక సీఎంఓ కార్యాలయంలోని ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది ? అనే విషయం వెలుగు చూసింది.

విధాన సౌధకు జంప్

విధాన సౌధకు జంప్

శుక్రవారం కృష్ణలో కర్ణాటక సీఎంఓ కార్యాలయం సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని వెలుగు చూడటంతో సీఎం బీఎస్. యడియూరప్ప అధికారిక కార్యక్రమాలు రద్దు అయ్యాయి. వెంటనే అక్కడి కార్యక్రమాలను విధాన సౌధకు మార్చారు. కృష్ణలోని కార్యక్రమాలు అన్ని రద్దు చేసి ఆ ప్రాంతంలోని ప్రతి అంగుళం శానిటైజ్ చేశారు.

Recommended Video

Lockdown In AP : Ongole లో ఎల్లుండి నుంచి 14 రోజులు Lockdown అమలు !
విధాన సౌధలో కరోనా !

విధాన సౌధలో కరోనా !

కర్ణాటక పేరు చెబితే ముందుగా బెంగళూరులోని విధాన సౌధ గుర్తుకు వస్తుంది. విధాన సౌధలోకి రాజకీయ నాయకులతో పాటు అధికారులు, మీడియా సిబ్బందితో పాటు ఏ ఒక్కరు వెళ్లాలన్నా కచ్చితంగా ప్రభుత్వం జారీ చేసిన పాస్ ఉండాలి. అలాంటి కట్టుదిట్టమైన విధాన సౌధలో పని చేసే ఉద్యోగికి కరోనా వైరస్ వచ్చిందని ఇప్పటికే వెలుగు చూసింది. ప్రస్తుతం సీఎంఓ కార్యాలయంతో పాటు విధాన సౌధలో పని చేస్తున్న ఉద్యోగులకు కరోనా వచ్చిందని వెలుగు చూడటంతో కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సీఎంఓ కార్యాలయం, విధాన సౌధను పైర్తిగా శానిటైజ్ చేస్తున్నారు.

English summary
Coronavirus: 3 of the staff members working at CM Yediyurappa's home office Krishna infected with Coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X