Coronavirus: 24 గంటల్లో 69 వేల మందికి కరోనా, ఇప్పుడే ఇలా ఉంటే అన్ లాక్ దెబ్బకు, దేవుడా!
న్యూఢిల్లీ/ బెంగళూరు/ ముంబాయి/ చెన్నై: భారతదేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి వ్యాధి తాండవం చేస్తోంది. గత 24 గంటల్లో భారత్ లో 69, 921 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దేశంలో మంగళవారం రాత్రి వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 36, 91, 116కు చేరుకుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కాటుకు 819 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భారతదేశంలో ఇప్పటి వరకు 65, 288 మంది కరోనా కాటుకు బలి అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పుడే ఇలా ఉంటే అన్ లాక్ దెబ్బతో ఇంకా ఎన్ని కేసులు పెరిగిపోతాయో ? అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

7.85 లక్షల యాక్టివ్ కేసులు
భారతదేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారినపడి 28, 39, 882 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 7, 85, 996 కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారతదేశంలో ఇప్పటి వరకు 21. 29 % యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

పెరుగుతున్న రికవరీ రేటు
దేశంలో కరోనా రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతోందని, మంగళవారానికి రికవరీ రేటు 76.94 % పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దేశంలో క్రమంగా కరోనా మరణాల రేటు కూడా తగ్గుతోందని, ప్రస్తుతం మరణాల రేటు 1.77 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.

వారంలో 5 లక్షల కరోనా కేసులు
భారతదేశంలో ఎన్నడూ లేనివిధంగా గత వారం రోజుల్లో ఐదు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఆగస్టు 31వ తేదీ వరకు 4, 33, 24, 834 శాంపిళ్లను పరీక్షించామని ఐసీఎంఆర్ తెలిపింది. ఒక్క సోమవారం రోజు మాత్రమే 10, 16, 920 శాంపిళ్లు పరీక్షించామని ఐసీఎంఆర్ తెలిపింది. దేశంలో మొత్తం 1, 583 ల్యాబుల్లో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది.

రెండు వారాల్లో 1.22 కోట్ల పరీక్షలు
గత రెండు వారాల్లో భారతదేశంలో మొత్తం 1. 22 కోట్ల కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నిర్దారణ పరీక్షల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ లో మాత్రమే 34 % పరీక్షలు జరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల్లో మాత్రమే 34 శాతం కరోనా పరీక్షలు నిర్వహించడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. దేశంలో ప్రతి మిలియన్ జనాభాలో 31, 394 కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
Recommended Video

ఇప్పుడే ఇలా ఉంటే అన్ లాక్ దెబ్బకు?
లాక్ డౌన్ నియమాలు అమల్లో ఉన్న సమయంలో కరోనా పాజిటివ్ కేసులు ఈ విధంగా నమోదు అవుతుంటే ఇప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లు, ప్రైవేటు బస్సుల సంచారానికి అనుమతి ఇచ్చారని, ఇక ప్రజలు విచ్చలవిడిగా సంచరిస్తే ఇక ముందుముందు ఏవిధంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతాయో ? అనే భయంగా ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద భారతదేశంలో ఒక్క రోజులోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో 69, 921 నమోదు కావడంతో ప్రజలు హడలిపోయారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications