వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus:కరోనావైరస్‌కు హోమియోపతి మందులు..ట్రోల్ చేసిన నెటిజెన్లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనాలోని వూహాన్ నగరంలో బయటపడ్డ కరోనా వైరస్ ఇప్పుడు పలు దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఓ రాకాసితో యుద్ధం చేస్తున్నామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటించారు. ప్రపంచదేశాలు కూడా కరోనా వైరస్‌పై సమీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో అధికారులు ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భారత్‌లో కూడా కరోనా వైరస్‌ లక్షణాలు కొందరిలో కనిపించాయి. ఇప్పటికే కేంద్రం నుంచి బృందాలు పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్‌కు హోమియోపతి మందు ఉందని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలో సూచించింది.

Coronavirus: రెక్కలు చాచిన కరోనా: అమెరికా, అరబ్ ఎమిరేట్స్ సహా 13 దేశాలకు ప్రాణాంతక వైరస్..!Coronavirus: రెక్కలు చాచిన కరోనా: అమెరికా, అరబ్ ఎమిరేట్స్ సహా 13 దేశాలకు ప్రాణాంతక వైరస్..!

ఆయుర్వేదం పద్ధతి ద్వారా వెళితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండొచ్చని చెబుతోంది. ఇందులో ముఖ్యంగా వ్యక్తిగతమైన శుభ్రతను పాటించాలని సూచిస్తోంది. సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవడంతో పాటు చేతులు కడుక్కోకుండా కళ్లు, ముక్కు, నోటిని తాకకూడదని చెబుతోంది. ఇక అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు కాస్త దూరంగా ఉండాలని సూచించింది. అనారోగ్యంతో ఉంటే బయటకు తిరగకుండా ఇంట్లోనే ఉండాలని చెబుతోంది. ఒకవేళ తుమ్ములు లేదా దగ్గు వస్తే ఒక రుమాల ముఖానికి అడ్డంగా పెట్టుకోండి. చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇక ముఖానికి ఎప్పుడూ మాస్క్ ధరించి ఉంచాల్సిందిగా ఆయుష్ చెబుతోంది. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. కరోనా వైరస్‌కు సంబంధించిన లక్షణాలు ఉన్నాయని గ్రహిస్తే వెంటనే దగ్గరలోని హాస్పిటల్‌కు వెళ్లాల్సిందిగా ఆయుష్ సూచిస్తోంది.

Coronavirus:Aayush ministry says Homoeopathy has treatment for Coronavirus, gets trolled

కరోనా వైరస్‌కు ఆయుష్ హోమియోపతి మందులను సూచించింది.

* అగస్త్య హరిత్యాకీ 5గ్రా... వెచ్చటి నీళ్లతో రోజుకు రెండు సార్లు తీసుకోవాలి

* సంశామని వాటి 500 మిల్లీగ్రాములు రోజుకు రెండు సార్లు

* త్రికతు (పిప్పలి, మరీచ్, శొంఠీ) మిశ్రమంను 5 గ్రాములు మరియు 3 నుంచి 5 తులసి ఆకులను ఒక లీటరు వేడి నీటిలో మరిగించి ఒక బాటిల్‌లో ఉంచుకోవాలి. అప్పుడప్పుడు ఈ మిశ్రమం కలిగిన నీటిని తాగుతూ ఉండాలి.

*ప్రతిమర్స నాస్యా : రోజు ఉదయం రెండు చుక్కల నువ్వుల నూనెను నాసిక రంధ్రాల్లో వేసుకోవాలి

ఇవన్నీ సూచనలు చేస్తూనే ఆయర్వేద డాక్టర్లను సంప్రదించాలని ప్రకటనలో ఆయుష్ పేర్కొంది. ఆయూష్ విడుదల చేసిన ప్రకటనను చూసిన నెటిజెన్లు తమదైన పద్ధతిలో కామెంట్స్ రాసుకొచ్చారు. కరోనా వైరస్‌ను నివారించగలమని చెప్పేందుకు ఎలాంటి బలమైన ఆధారాలు లేవని ఒక నెటిజెన్ రాసుకొచ్చారు. అంతేకాదు ఇలాంటి అశాస్త్రీయ పద్దతులను ప్రజలపై రుద్దవద్దంటూ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ నివారణకు వాటి బారినపడ్డ వారికోసం 9 రోజుల్లో 1500 పడకల ఆస్పత్రిని చైనా నిర్మిస్తోందని.. భారత్ మాత్రం ఇలాంటి చర్యలు తీసుకోకుండా హోమియోపతి, ఉనానీ అంటూ కబుర్లు చెబుతోందంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే చైనాలో కరోనా వైరస్‌తో మృతిచెందిన వారి సంఖ్య 131కి చేరుకుంది.

English summary
Amid worldwide preparedness to combat the rapid spread of novel coronavirus, the Ayush ministry has claimed that homoeopathy has a cure for coronavirus. The ministry has issued a press release listing out the steps required to combat the virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X