స్ట్రీమింగ్ మొదలైన గంటల్లోనే నంబర్ వన్.. అన్న ఖాతాలో మరో హిట్టు!
ప్రముఖ నటుడు అడివి శేష్ కథానాయకుడిగా నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్' థియేటర్లలో భారీ విజయాన్ని అందుతున్న అనంతరం ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోనూ తన హవా కొనసాగిస్తోంది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైన ఈ సినిమా.. స్ట్రీమింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఇండియాలో టాప్ స్థానానికి చేరుకుంది. వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలోనూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి అడివి శేష్ కెరీర్లో మరో మైలురాయిని నమోదు చేసింది.
డిజిటల్ వేదికపై 'డెకాయిట్' ప్రభంజనం
ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. సరిగ్గా నెల రోజుల తర్వాత మే 8న ఓటీటీ వేదికపైకి అడుగుపెట్టింది. అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించగా.. బాలీవుడ్ దిగ్గజం అనురాగ్ కశ్యప్, వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో మెరిశారు. దక్షిణాదిలోని నాలుగు ప్రధాన భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) ఒకేసారి స్ట్రీమింగ్ అవుతుండటంతో, అన్ని భాషల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా కథలో ఉన్న ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను బాగా కట్టుకుంటోంది.

మేకింగ్, నిర్మాణ విలువలు అద్భుతం
ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడంలో దర్శకుడు షానీల్ డియో ప్రతిభ స్పష్టంగా కనిపిస్తోంది. తొలి చిత్రంతోనే ఆయన విజువల్స్‌ను హ్యాండిల్ చేసిన తీరు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించారు. హై-క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్, కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇటీవలి కాలంలో వచ్చిన బెస్ట్ టెక్నికల్ మూవీస్‌లో ఒకటిగా 'డెకాయిట్' ప్రశంసలు అందుకుంటోంది.
శేష్ ఖాతాలో మరో హిట్
సరైన కథలను ఎంచుకోవడంలో అడివి శేష్‌కు సాటిలేరని ఈ సినిమా మరోసారి నిరూపించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన.. 'డెకాయిట్' కోసం ఎంచుకున్న భిన్నమైన రోల్, షేడ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ చార్టులలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ అడివి శేష్ క్రేజ్‌ను మరోసారి చాటిచెప్పింది. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని 'డెకాయిట్' విజయం స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications