ఎవరీ వైఎస్ అనిల్ రెడ్డి - సీఎంలతో సహా బిగ్ షాట్స్ అంతా అక్కడే, తెర వెనుక..!!
వైఎస్ అనిల్ రెడ్డి. మూడు రోజులుగా ఈ పేరు సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉంది. అనిల్ రెడ్డి కుమార్తె వివాహం చెన్నైలో జరిగింది. ముఖ్యమంత్రులు.. రాజకీయ నేతలతో పాటుగా బిగ్ షాట్స్ ఈ వివాహానికి హాజరయ్యారు. ఆ ఫొటోలు.. వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో, అసలు ఎవరు ఈ అనిల్ రెడ్డి. జగన్ తో బంధం ఏంటి. ఇంత మంది బిగ్ షాట్స్ ఎందుకు హాజరయ్యారు. తమిళనాడు సీఎం విజయ్ తో రిలేషన్ ఏంటి.. ఇలా ఎన్నో సందేహాలతో నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. దీంతో, వైఎస్ అనిల్ రెడ్డి కి సంబంధించి ఆసక్తి కర అంశాలు తెలుస్తున్నాయి.
మూడు రోజులుగా కొన్ని ఫొటోలు.. వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇటీవల చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగిన అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ రెడ్డి వివాహ వేడుకకు దేశంలోని అతిరథ మహారథులు హాజరుకావడంతో అనిల్ రెడ్డి పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. అందులో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, అనిల్ రెడ్డికి సోదరుడైన వైఎస్ జగన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వంటి ప్రముఖులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు వీరు ముగ్గురూ ఎంతో ఉత్సాహంగా మాట్లాడుకోవడం జరిగింది. వ్యాపార దిగ్గజాలు వివాహానికి హాజరయ్యారు. దీంతో.. అసలు ఎవరీ అనిల్ రెడ్డి అనే చర్చ మొదలైంది. మాజీ సీఎం జగన్ కు అనిల్ రెడ్డి సోదరుడు అవుతారు. వైఎస్సార్ స్వయాన సోదరుడు జార్జిరెడ్డి కుమారుడు. జగన్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటి నుండి మద్దతు గా నిలిచారు.
కాగా.. అనిల్ రెడ్డి చెన్నై వేదికగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆఫ్రికాలో 'రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్' పేరుతో లిక్కర్ వ్యాపారంతో పాటు నిర్మాణ రంగం, మైనింగ్, క్వారీలు, ఫైనాన్స్ రంగాలలో ఈయనకు వ్యాపారాలు ఉన్నాయి. అనిల్ రెడ్డి మైనింగ్ రంగంలో ఇతర దేశాల్లోనూ వ్యాపారం చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తో కూడా ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది.
విజయ్ టీవీకే ఏర్పాటు నుంచి అధికారంలోకి రావటం వరకు తెర వెనుక కీలకంగా వ్యవహరించిన వారిలో అనిల్ రెడ్డి ప్రముఖులు. ఇప్పటికీ సీఎం విజయ్ వెనుక ఉన్న కోటరీలో అనిల్ రెడ్డి కీలకం అని రాజకీయంగా ప్రచారంలో ఉంది. ఇక.. ఈ వివాహానికి ఆదానీ లాంటి ప్రముఖులు సైతం హాజరయ్యారు. అన్ని పార్టీల ముఖ్య నేతలతోనూ అనిల్ కు సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో.. ఇప్పుడు అనిల్ రెడ్డి ఇంట్లో జరిగిన శుభకార్యంతో ఆయన గురించి ఆసక్తి కర చర్చ జరుగుతోంది.














Click it and Unblock the Notifications
