Bengaluru: ఐటీ హబ్ లో కరోనా రికార్డ్ బ్రేక్, బాహుబలి పంజా, ఎవడికి వాడే హీరో, మాస్క్ మడిచి !
బెంగళూరు/ చెన్నై/ ముంబాయి: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో భారతదేశ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు. ఐటీ హబ్ గా ప్రపంచదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు సిటీ పేరు మరోసారి మార్మోగిపోయింది. ఇప్పుడు అభివృద్ది విషయంలో కాకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదులో దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ సిటీగా బెంగళూరు పేరు రికార్డు నమోదు చేసుకుంది. బెంగళూరులోని ప్రజలు విచ్చలవిడిగా మాస్క్ లు కూడా వేసుకోకుండా, వాటిని మడిచి ఎక్కడో పెట్టుకుని భౌతికదూరం పాటించకుండా విపరీతంగా చక్కర్లు కొట్టడంతో కరోనా మహమ్మారి బాహుబలి పంజా విసిరింది. బెంగళూరులో చాలా మంది ఎవడికి వాడే హీరోగా ఫీలైపోయి మాకు కరోనా రాదని తిరగడంతో కోవిడ్ మహమ్మారి అందరికి సినిమా చూపిస్తోంది.
Recommended Video

24 గంటల్లో రికార్డు బ్రేక్
భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తన ప్రతాపం చూపిస్తోంది. చిన్నాపెద్ద, ఆడామగ అని తేడా లేకుండా వయసుతో అస్సలు పని లేకుండా ఎవరికి పడితే వాళ్లకు అంటుకుంటోంది. భారతదేశంలో గత 24 గంటల్లో ఢిల్లీలో 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రజలు ఆందోళనతో హడలిపోతున్నారు.

రికార్డు బద్దలు కొట్టిన కర్ణాటక
గత 24 గంటల్లో ఢిల్లీ రికార్డులను కర్ణాటక బద్దలు కొట్టింది. గత 24 గంటల్లో కర్ణాటకలో ఏకంగా 34, 804 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కన్నడిగులు హడలిపోతున్నారు. బెంగళూరులో ఏకంగా 20 మార్క్ క్రాస్ చెయ్యడంతో అక్కడి ప్రజలకు ఆందోళనతో చెమలుపడుతున్నాయి.

బీపీ.... షుగర్ కాదు.... కరోనా పాజిటివ్ కేసులు
గత ఏప్రిల్ 15వ తేదీన బెంగళూరులో కేవలం 10 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏప్రిల్ 22వ తేదీన 15 వేల కరోనా పాజిటివ్ కేసులు, ఏప్రిల్ 25వ తేదీ నాటికి 20 వేల కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో బెంగళూరు ప్రజలు బెంబేలు ఎత్తుతున్నారు. స్వామి ఏమిటి మాకు ఈ పరీక్ష, బీపీ.... షుగర్ లెవల్స్ పెరిగినల్లు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి అంటూ ఐటీ హబ్ ప్రజలు ఆందోళనతో హడలిపోతున్నారు.

అందరూ హీరోలే... మాకు రాదు... మాకు రాదు
బెంగళూరు సిటీలో చాలా మంది ముఖాలకు మాస్క్ లు వేసుకోకుండా, కనీసం బౌతికదూరం పాటించకుండా పాటుపడటంతో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అందరూ ఎవరికి వాళ్లు హీరోలుగా ఫీలైపోయి మాకు కరోనా రాదులే, మేమెందుకు మాస్క్ లు వేసుకోవాలి అంటూ, వాటిని మడిచి శుభ్రంగా జోబుల్లో, బైక్ కవర్లలో పెట్టుకుని విచ్చలవిడిగా తిరిగేయడంతో కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరోకరికి చాపకింద నీరులా వ్యాపిస్తోందని ఆరోగ్య శాఖ అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

బెంగళూరులో పేరుకే ఉంటున్నారని కానీ ?
బెంగళూరులో కొన్ని లక్షల మంది విద్యావంతులు ఉంటున్నారు. చాలా మంది బెంగళూరు సిటీలో పేరుకు మాత్రమే ఉంటున్నారని కాని బుద్దిమాత్రం చెత్తకుప్పల కంటే ధరిద్రంగా ఉందని ఆరోపణలు ఉన్నాయి. కరోనా వైరస్ నుంచి వారినివారు, వారి కుటంబాలను కాపాడుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నామనే కనీసం ఫీలింగ్, భయం లేకుండా ఇంకా మాస్క్ లు లేకుండా బయట తిరుగుతున్నారని ఆరోగ్య శాఖ అధికారులు మండిపడుతున్నారు. మొత్తం మీద బెంగళూరు నగరం కరోనా పాజిటివ్ కేసులో రికార్డు బ్రేక్ తో నెంబర్ వన్ దిశగా దూసుకుపోతుందని వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications