లాక్‌డౌన్: మానవతను చాటుకున్న బెంగళూరు పోలీసులు, నెటిజన్ల ప్రశంసలు
బెంగళూరు: కర్ణాటకలో కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కర్ణాటక రాష్ట్రం కూడా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెంగళూరులు పోలీసులు అన్నదానం చేసి మానవతను చాటుకున్నారు.
పేదలు, ఆహారం అవసరం ఉన్న వారికి పోలీసులు అన్నదానం చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో అన్నదానం చేసి అన్నర్థుల ఆకలిని తీర్చారు. కాగా, పోలీసుల ఈ చర్యపై పలువురి నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఫొటోలు ట్విట్టర్ లో పోస్టు చేయడంతో నెటిజన్లు పోలీసుల మానవతా దృక్ఫథాన్ని కొనియాడుతున్నారు.

కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప లాక్ డౌన్ రాష్ట్ర వ్యాప్తంగా విధించారు. ముందుగా తొమ్మిది జిల్లాల్లో తీవ్రమైన ఆంక్షలు విధించగా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలు బయటికి రావొద్దని, నిత్యావసరాలు కూడా ఇంటి నుంచి ఒక్కరే వచ్చి తీసుకెళ్లాలని సీఎం యడ్యూరప్ప కోరారు.
Crackdown on criminals, or be compassionate? We can do both. While the city is on a lockdown owing to recent events, we are doing our bit. #Janasnehipolice #ArrestCorona pic.twitter.com/rcDXZedWZC
— BengaluruCityPolice (@BlrCityPolice) March 24, 2020
కాగా, కర్ణాటకలో ఇప్పటి వరకు 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకు చెందిన ఒకరు ఇప్పటికే కరోనా బారినపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక మనదేశంలో 556 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 9కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 40గా ఉంది. తాజాగా తెలంగాణలో మరో పాజిటివ్ కేసు నమోదవడంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 557కి చేరింది.












Click it and Unblock the Notifications