Coronavirus: బయోకాన్ చీఫ్ కిరణ్ మంజూదార్ షాకు పాజిటివ్, వీఐపీలను వెంటాడుతున్న కరోనా !
బెంగళూరు/ న్యూఢిల్లీ: కర్ణాటకలో కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తోంది. ఇప్పటికే కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప, మాజీ సీఎం సిద్దరామయ్యతో పాటు ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు, మరికొంత మంది మంత్రులు, నాయకులు వీఐపీలు కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా బయోకాన్ చీఫ్ కిరణ్ మంజూదార్ షా కు సైతం కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో పలువురు వ్యాపారులు షాక్ కు గురైనారు. కోవిడ్ -19 రోగుల జాబితాలో నేను చేరిపోయాను అంటూ బయోకాన్ చీఫ్ కిరణ్ మంజూదార్ షా స్వయంగా ట్విట్ చేశారు.

కరోనా దెబ్బతో సీఎం బిజీబిజీ
కర్ణాటకలో విపరీతంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో ఆ వ్యాధిని నిర్మూలించడానికి కర్ణాటక ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. కరోనా వైరస్ వ్యాధి బారినపడిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కరోనాతో పోరాటం చేసి వ్యాధి నయం చేసుకుని బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన సీఎం బీఎస్. యడియూరప్ప కరోనా వైరస్ నిర్మూలణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

సోమవారం షాక్
కర్ణాటకలో ఆగస్టు 17వ తేదీ సోమవారం ఒక్కరోజే 6, 317 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో ఇప్పటి వరకు 2, 33, 283 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సోమవారం ఒక్కరోజే 6, 317 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు షాక్ కు గురైనారు. సోమవారం బెంగళూరు సిటీలో మాత్రమే 2, 053 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. బెంగళూరు నగరంలో ఇప్పటి వరకు 91, 864 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇంకా 34, 408 కరోనా ఆక్టీవ్ కేసులు ఉన్నాయి.

బయోకాన్ చీఫ్ కు కరోనా పాజిటివ్
కరోనా వైరస్ వ్యాధి సోకిన ప్రముఖుల జాబితాలో బయోకాన్ చీఫ్ కిరణ్ మంజూదార్ షా చేరిపోయారు. అనారోగ్యానికి గురైన కిరణ్ మంజూదార్ షాకు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్దారించారు. తాను కరోనా వైరస్ రోగుల జాబితాలో చేరిపోయానని బయోకాన్ చీఫ్ కిరణ్ మంజూదార్ షా ట్విట్ చేశారు.
Recommended Video

పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులు
అతి తక్కువ పెట్టుబడితో బయోకాన్ సంస్థను ప్రారంభించిన కిరణ్ మంజూదార్ షా నేడు ప్రపంచం గుర్తించ దగిన సంస్థగా బయోకాన్ సంస్థను తీర్చిదిద్దారు. కిరణ్ మంజూదార్ షా సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమెకు పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులను ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అవార్డులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తగా కిరణ్ మంజూదార్ షాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి కిరణ్ మంజూదార్ షా నేడు కరోనా వైరస్ బారినపడ్డారు.












Click it and Unblock the Notifications