Coronavirus cases in india: భారత్ కు భారీ ఉపశమనం ఇచ్చిన తాజా కేసులు..10,423 కొత్త కేసులు, 443 మరణాలు !!
భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 10,423 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. భారతదేశం 250 రోజులలో ఈ రోజు అత్యల్ప రోజువారీ కోవిడ్ కేసులను నమోదు చేసింది. ఇది నిన్నటి కంటే 16 శాతం తక్కువ. అయితే, గత 24 గంటల్లో భారతదేశంలో 443 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు గత 24 గంటల్లో కనీసం 15,021 మంది కోలుకున్నారు.దీంతో ప్రస్తుతం దేశంలో కోలుకున్న వారి సంఖ్య 3,36,83,581 గా ఉంది.
యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 1,53,776 .. కేరళ వల్లే భారత్ కు ఎఫెక్ట్
యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో ఒక శాతం కంటే తక్కువ, ప్రస్తుతం 0.45 శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 1,53,776 వద్ద ఉంది. ఇది 250 రోజులలో కనిష్ట స్థాయిలో యాక్టివ్ కేసులున్నాయి.1.16 శాతం ఉన్న వీక్లీ సానుకూలత రేటు గత 39 రోజులుగా రెండు శాతం కంటే తక్కువగా ఉంది. 1.03 శాతం రోజువారీ సానుకూలత రేటు గత 29 రోజులుగా రెండు శాతం కంటే తక్కువగా ఉంది.గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 7167 కరోనా కేసులు నమోదు కాగా, 167 మంది కరోనా మహమ్మారి కి బలయ్యారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో 70 9266 యాక్టివ్ కేసులున్నాయి.

మహారాష్ట్ర , తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో తాజా కేసుల లెక్క ఇది
మహారాష్ట్రలో గత 24 గంటల్లో 1,172 కరోనా కేసులు నమోదు కాగా, 20 మంది కరోనా కారణంగా మరణించారు. 16,658 కరోనా యాక్టివ్ కేసులు ప్రస్తుతం మహారాష్ట్ర లో ఉన్నాయి. ఒక తమిళనాడు రాష్ట్రంలో 1009 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, 19 మంది కరోనా కారణంగా మరణించారు. ఇక తమిళనాడులో 11,492 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ లో గత 24 గంటల్లో 914 కరోనా కేసులు నమోదు కాగా 15 మంది కరోనా కారణంగా మరణించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం 8,296 యాక్టివ్ కేసులున్నాయి .
మిజోరాం లో, ఏపీలో కాస్త తగ్గుతున్న కొత్త కేసులు
ఆ తర్వాత స్థానంలో ఉన్న మిజోరాంలో 579 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం మిజోరాం రాష్ట్రంలో 6,315 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 385 కరోనా కొత్త కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4355 యాక్టివ్ కేసులున్నాయి.
తెలంగాణలో గణనీయంగా తగ్గినా కరోనా, అయినా అలెర్ట్ గా ఉండాలన్న నిపుణులు
తెలంగాణ రాష్ట్రంలో 121 కొత్త కేసు నమోదు కాగా ఒక్కరూ గత 24 గంటల్లో మరణించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2327 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా కేసులు తగ్గుతున్నట్టు అనిపిస్తున్నా, క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుతున్నా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా మళ్లీ విస్తరించే ప్రమాదముందని సూచిస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం లేకపోలేదని వార్నింగ్ ఇస్తున్నాయి.












Click it and Unblock the Notifications