• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
LIVE

భారత్‌లో కరోనా విలయతాండవం: పెరుగుతున్న మరణాల సంఖ్య...జాగ్రత్త చర్యలతోనే విజయం

|

బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది. మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే పోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య క్రమంగా 27 లక్షలను దాటాయి. గంటగంటకూ రాకెట్లా దూసుకెళ్తున్నాయి. అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు.. దానికి అనుగుణంగా మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో, మరణాలకు అడ్డుకట్ట వేయడంలో అగ్రదేశాలు సైతం చేతులు ఎత్తేశాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ స్ట్రెయిన్ మరింత గుబులు పుట్టిస్తోంది.

Coronavirus Vaccine Live Updates In Telugu Across India Andhra Pradesh And Telangana

Newest First Oldest First
9:51 PM, 18 May
ఆంధ్రప్రదేశ్
ఏపీలో గత 24 గంటలలో కొత్తగా 21,320 కరోనా కేసులు నమోదు కాగా, 99 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,11,501 యాక్టివ్ కేసులున్నాయి.
9:45 PM, 18 May
తెలంగాణ
గత 24 గంటల వ్యవధిలో 71,616 నమూనాలను పరీక్షించగా 3982 మందికి కరోపా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,36,766కి చేరింది. తాజాగా, మరో 27 మంది మహమ్మారి బారినపడి మరణించారు.తెలంగాణలో ప్రస్తుతం 48,110 యాక్టివ్ కేసులున్నాయి.
8:29 PM, 18 May
ఉత్తర్‌ప్రదేశ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 8737 కరోనా కేసులు నమోదు కాగా, 21,108 మంది కోలుకున్నారు. 255 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,36,342 యాక్టివ్ కేసులున్నాయి.
8:13 PM, 18 May
కర్నాటక
కర్ణాటకలో గత 24 గంటల్లో కొత్తగా 30,309 కరోనా కేసులు నమోదు కాగా, 58,395 మంది కోలుకున్నారు. మరో 525 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,75,028 యాక్టివ్ కేసులున్నాయి.
6:04 PM, 18 May
పుదుచ్చేరి
పుదుచ్చేరిలో ఈ రోజు 1797 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 33 మంది మృతి చెందారు
6:02 PM, 18 May
2 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు వారికి కొవాగ్జిన్ రెండవ దశ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. మరో 10 రోజుల్లో ట్రయల్స్ నిర్వహిస్తారని తెలిసింది:నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్
6:00 PM, 18 May
గోవా
గోవాలో ఈరోజు 1358 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 45 మంది మృతి చెందారు
3:31 PM, 18 May
ఒడిషా
మే 19 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఒడిషాలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
3:30 PM, 18 May
ఢిల్లీ
ఢిల్లీలో గత 24 గంటల్లో 4482 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 265 మంది మృతి చెందారు
3:29 PM, 18 May
మధ్యప్రదేశ్
నెల రోజుల తర్వాత కూడా కోవిడ్‌తో చనిపోయిన వారి అస్తికలు తీసుకునేందుకు కుటుంబ సభ్యులు రాకపోవడంతో మా సిబ్బందే ఈరోజు నర్మదా నదిలో అస్తికలు కలిపేశారు:సాగర్ మున్సిపల్ కమిషనర్ ఆర్పీ ఆహిర్వార్
1:07 PM, 18 May
కోవిడ్ పై పోరులో భాగంగా వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడం, కాంటాక్ట్స్‌ను గుర్తించడం, స్థానికంగా కంటెయిన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేయడం వంటివి ఆయుధాలు. వీటిని సరిగ్గా అమలుచేస్తే కరోనాపై విజయం సాధించొచ్చు: ప్రధాని మోడీ
1:05 PM, 18 May
గతేడాది లాక్‌డౌన్ సందర్భంగా వ్యవసాయ రంగానికి మినహాయింపు ఇచ్చాం. రైతులు భౌతిక దూరం పాటిస్తూ చక్కగా వ్యవసాయం చేసి మంచి ఫలితాలుె పొందారు. నాకే ఆశ్చర్యం వేసింది: ప్రధాని మోడీ
1:03 PM, 18 May
కరోనా వ్యాక్సిన్ సప్లయ్ పై కేంద్ర ప్రభుత్వం నిరంతరాయంగా కృషిచేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటోంది: ప్రధాని మోడీ
9:51 AM, 18 May
కోవిడ్‌తో మరణించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కేకే అగర్వాల్
9:49 AM, 18 May
భారత్‌లో గత 24 గంటల్లో 2,63,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 4329 మంది మృతి చెందారు
5:31 PM, 17 May
2డీజీ డ్రగ్ రెండో విడత మే 27న పరిమితి సంఖ్యలో మాత్రమే తీసుకొస్తాం. జూన్ తొలివారం నుంచి రెగ్యులర్‌గా ఉత్పత్తి చేస్తాం. అప్పటి నుంచి అందరికీ అన్ని చోట్లా ఈ డ్రగ్ అందుబాటులోకి వస్తుంది: డీఆర్‌డీఓ ఛైర్మెన్ సతీష్ రెడ్డి
5:29 PM, 17 May
ఢిల్లీ
ఢిల్లీలో గత 24 గంటల్లో 4524 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 340 మంది మృతి చెందారు
5:28 PM, 17 May
పీఎం కేర్స్ ఫండ్స్‌ వినియోగించి 500 నుంచి 849కి ఆక్సిజన్ ప్లాంట్లను పెంచాం. ఇక జమ్మూ శ్రీనగర్, గాంధీనగర్‌లలో 500 పడకలను ఏర్పాటు చేస్తున్నాం: డీఆర్‌డీఓ ఛైర్మెన్ సతీష్ రెడ్డి
3:08 PM, 17 May
ఆంధ్రప్రదేశ్
మే చివరి వరకు కర్ఫ్యూ పొడిగించిన ఏపీ ప్రభుత్వం. ఆమేరకు ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్
3:08 PM, 17 May
తమిళనాడు
కోవిడ్ బాధితుల కోసం రూ.50 లక్షలు చెక్‌ను తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అందజేసిన సూపర్‌స్టార్ రజినీకాంత్
3:06 PM, 17 May
హిమాచల్ ప్రదేశ్
18 -44 ఏళ్ల మధ్య వయసున్న వారికోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్
3:06 PM, 17 May
పంజాబ్
అమృత్‌సర్‌లో సరిహద్దు గ్రామాల్లో వైద్య సదుపాయాలు కరువైయ్యాయని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు
10:24 AM, 17 May
ఢిల్లీ
ఢిల్లీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ సెంటర్‌లో యోగా చేస్తున్న కోవిడ్ పేషెంట్లు
10:21 AM, 17 May
బీహార్
కోవిడ్‌తో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని చెత్త బండిపై స్మశానవాటికకు తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేయించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను: సివిల్ సర్జన్ డాక్టర్ సునీల్ కుమార్
10:19 AM, 17 May
భారత్‌లో గత 24 గంటల్లో 2,81,386 కొత్త కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 4,106 మంది మృతి చెందారు
2:24 PM, 16 May
హర్యానా
పానిపట్‌లోని గురు తేజ్‌బహదూర్ సంజీవిని ఆసుపత్రిలో 500 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
2:21 PM, 16 May
ఉత్తరాఖండ్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ-ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధ్య కొనసాగించిన టెలిఫోన్ సంభాషణ వివరాలను వెల్లడించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్ కార్యక్రమం, వ్యాక్సిన్ వృధా వంటి అంశాలపై ఆ ఇద్దరి మధ్య సంభాషణ సాగిందని సీఎంఓ తెలిపింది.
1:57 PM, 16 May
ఆంధ్రప్రదేశ్
గుజరాత్‌లోని కనలుస్ నుంచి ఏపీలోని గుంటూరుకు చేరుకున్న రెండో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్. ఇది రెండో ఎక్స్‌ప్రెస్. నాలుగు కంటైనర్ ట్యాంకర్లలో 76.39 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను మోసుకొచ్చిందా ఎక్స్‌ప్రెస్.
1:36 PM, 16 May
ఒడిషా
సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగులను నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేసిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వం. ఇండోర్, అవుట్ డోర్ షూటింగులను నిషేధించినట్లు ప్రకటించింది.
1:28 PM, 16 May
కర్నాటక
హిరెకుర్‌ నియోజకవర్గంలో కోవిడ్ బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన కర్ణాటక మంత్రి బీసీ పాటిల్
READ MORE

English summary
A 76 year old man from Kalaburagi who died on March 10 is the country's first Covid-19 fatality, with test results on Thursday confirming that he was infected. The man with a travel history to Saudi Arabia and died when he was being brought from a Hyderabad hospital to Kalaburagi on March 10.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X