Coronavirus: క్వారంటైన్ లో 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి వీడియో తీసి బ్లాక్ మెయిల్, కామాంధులు !

న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) వ్యాధితో క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న మహిళలు, యువతులకు రక్షణ లేకుండా పోతుందని మరోసారి వెలుగు చూసింది. దేశరాజధాని ఢిల్లీలో ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసులు (ITBP)నిర్వహిస్తున్న కరోనా క్వారంటైన్ కేంద్రంలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరగడం, మరో కామాంధుడు అత్యాచారం చేస్తున్న సమమంలో మొబైల్ లో వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశారు. కరోనా క్వారంటైన్ లో జరిగిన ఈ దారుణాన్ని బాలిక ధైర్యంగా బయటపెట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది.

 ఢిల్లీ కరోనా క్వారంటైన్ లో బాలిక

ఢిల్లీ కరోనా క్వారంటైన్ లో బాలిక

దేశ రాజధాని ఢిల్లీలోని ఛతూర్ పూర్ లోని సర్దార్ పటేల్ కోవిడ్ 19 కేర్ సెంటర్ ను ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ రోగులకు సర్దార్ పటేల్ కరోనా క్వారంటైన్ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. జులై మొదటి వారంలో 14 ఏళ్ల బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కరోనా లక్షణాలతో ఛతూర్ పూర్ లోని క్వారంటైన్ కేంద్రంలో చేరి చికిత్స పొందుతున్నారు.

 క్వారంటైన్ లో కామాంధులు

క్వారంటైన్ లో కామాంధులు

జులై మొదటి వారంలో 14 ఏళ్ల బాలిక క్వారంటైన్ కు వచ్చిన సందర్బంలోనే 19 ఏళ్ల యువకుడు, అతని కుటుంబ సభ్యులు కరోనా పాజిటివ్ తో అదే క్వారంటైన్ లో చేరారు. బాలికతో పాటు 19 ఏళ్ల బాలుడు, అతని 19 ఏళ్ల స్నేహితుడు అక్కడ చికిత్స పొందుతున్నారు. బాలిక మీద ఇద్దరు స్నేహితులు గత వారం రోజుల నుంచి కన్ను వేశారు.

 అర్దరాత్రి బాత్ రూంలో !

అర్దరాత్రి బాత్ రూంలో !

జులై 15వ తేదీ అర్దరాత్రి బాలిక మూత్రవిసర్జన చెయ్యడానికి క్వారంటైన్ కేంద్రంలోని బాత్ రూంలోకి వెళ్లింది. అలాంటి సమయం కోసం వేచి చూస్తున్న ఇద్దరు కామాంధులు బాలిక వెళ్లిన బాత్ రూంలోకి చరబడ్డారు. 19 ఏళ్ల కామాంధుడు బాలికపై అత్యాచారం చేశాడు. అదే సమయంలో మరో 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చేస్తున్న సమయంలో అతని మొబైల్ లో వీడియో తీశాడు. తరువాత అత్యాచారం వీడియో అడ్డం పెట్టుకున్న ఇద్దరు కామాంధులు తమ కోరిక తీర్చాలని బాలికను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టారు.

 పాపం పండిపోయింది

పాపం పండిపోయింది

బాలిక జరిగిన విషయం ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. బాలిక ఫిర్యాదు మేరకు ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసులు ఇద్దరు కామాంధులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఢిల్లీ అడిషనల్ పోలీసు కమిషనర్ పర్వీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచామని అన్నారు. అత్యాచారం చేసే సమయంలో వీడియో తీసిన మొబైల్ ఫోన్ ను తాము స్వాధీనం చేసుకున్నామని డీసీపీ పర్వీందర్ సింగ్ చెప్పారు.

Recommended Video

    Tollywood Juniour Artists Requesting Government to Help During COVID-19 Pandemic Situations
     గవర్నర్ ప్రారంభించిన కోవిడ్ కేర్ సెంటర్

    గవర్నర్ ప్రారంభించిన కోవిడ్ కేర్ సెంటర్

    కోవిడ్ కేర్ సెంటర్ లో మహిళలు, పురుషులకు ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలు, బాత్ రూంలు ఉన్నాయని డీసీపీ పర్వీందర్ సింగ్ అన్నారు. బాలికను సంరక్షణా కేంద్రానికి తరలించామని, ఆమె కరోనా వైరస్ వ్యాధి నయం అయ్యే వరకు అక్కడే ఉంటుందని డీసీపీ పర్వీందర్ సింగ్ చెప్పారు. బాలికపై అత్యాచారం జరిగిన కోవిడ్ కేర్ సెంటర్ లో 10, 000 పడకలు ఉన్నాయి. ఇక్కడ ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోని కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఛతూర్ పూర్ లోని కోవిడ్ కేర్ సెంటర్ ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బాలాజీ ప్రారంభించిన విషయం తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+