వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: కాలా అడ్డాలో సీన్ రివర్స్, నిన్న పరుగో పరుగు, నేడు రోల్ మోడల్, ఒక్కసారి కాదు కరోనా!

|
Google Oneindia TeluguNews

ముంబై/ న్యూఢిల్లీ: ఆసియా ఖండంలోనే ముంబాయి ధారావి ప్రాంతం అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందింది. కరోనా వైరస్ తాండంవం చేస్తున్న సమయంలో మరోసారి ధారావి ప్రాంతం వార్తల్లోకి ఎక్కింది. ఇదే ధారావి ప్రాంతం నేపథ్యంలో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నిటించిన కాలా సినిమా సంచలన విజయం సాధించింది. అలాంటి ధారావి ప్రాంతంలో కరోనా వైరస్ తాండంవం చేసింది. ధారావి పేరు చెబితే ముంబై ప్రజలు నిన్నటి వరకు పరుగో పరుగు అంటూ హడలిపోయారు. ఇప్పుడు అదే ధారావి మురికివాడల ప్రాంతం ముంబైలోని మిగిలిన ప్రాంతాలకు కరోనా వైరస్ అరికట్టడంలో రోల్ మోడల్ అయ్యింది.

Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి!Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి!

వామ్మో ధారావి

వామ్మో ధారావి

ముంబై నగరంలోని ధారావి ప్రాంతం ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడలు (స్లం) ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇరుకుఇరుకు ఇండ్లు, అతి చిన్న డ్రైనేజ్ లు, చిన్నచిన్న రోడ్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అలాంటి మురికివాడల్లో ఎవరైనా కొత్త వారు ఒక్కరోజు కూడా పూర్తిగా ఉండలేరు అని ప్రచారంలో ఉంది. ధారావి ప్రాంతం అంటేనే వామ్మో ఆ ప్రాంతమా అని ముంబై ప్రజలు హడలిపోతుంటారు.

కరోనా తాండవం

కరోనా తాండవం

మహారాష్ట్రలో కరోనా వైరస్ రోజురోజుకు పెరిగిపోతున్న సమయంలో ముంబైలోని ధారావి ప్రాంతం అల్లకల్లోలం అయ్యింది. ఒక్కసారిగా ధారావి ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసు సంఖ్య అమాంతం పెరిగిపోయాయి. ఒక్క మే నెలలో మాత్రమే వెయ్యి కరోనా పాజిటివ్ కేసులు ఒక్క ధారావి ప్రాంతంలోనే నమోదు అయ్యాయి, ముంబైలో కరోనా వైరస్ కు ధారావి ప్రాంతం హాట్ స్పాట్ కావడంతో బృహాన్ ముంబై మునిసిపల్కర్పోరేషన్ (BMC) అధికారులు హడలిపోయారు.

పక్కాప్లాన్ తో కరోనాకు కళ్లెం

పక్కాప్లాన్ తో కరోనాకు కళ్లెం

ధారావి ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులకు కళ్లెం వెయ్యడానికి బీఎంసీ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. ధారావి మురికివాడల్లో ర్యాపిడ్ యాక్షన్ ప్లాన్ అమలు చెయ్యాలని బీఎంసీ అధికారులు నిర్ణయించారు. ముంబై కరోనా హాట్ స్పాట్ అయిన ధారావి మురికివాడల్లో 50 మొబైల్ ఫివర్ క్లీనిక్ అంబులెన్స్ సేవలు ప్రారంభించారు. ధారావి ప్రాంతంలోని అన్ని ప్రాంతాలు శుభ్రంగా పెట్టారు. మొబైల్ ఫీవర్ క్లీనిక్ అంబులెన్స్ వాహనాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ధారావి ప్రాంతంలో అనారోగ్యానికి గురైన వారికి మెరుగైన చికిత్స అందించారు.

సీన్ రివర్స్..... ప్రజలు హ్యాపీ

సీన్ రివర్స్..... ప్రజలు హ్యాపీ

ఒక్క మే నెలలో వెయ్యికి పైగా కరోనా వైరస్ కేసులు నమోదు అయిన ధారావి ప్రాంతం మెల్లమెల్లగా కోలుకోవడం మొదలుపెట్టింది. ధారావి ప్రాంతంలో ఇంటింటికి తిరిగిన వైద్య సిబ్బంది ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారికి రక్తపరీక్షలు చేశారు. కరోనా వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జూన్ నెలలో ధారావి ప్రాంతంలో కేవలం 274 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనాయి. ధారావి ప్రాంతంలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వస్తే వెంటనే అక్కడికి మొబైల్ ఫీవర్ క్లీనిక్ అంబులెన్స్ వాహనాల్లో వెళ్లిన వైద్యులు వారికి వెంటనే చికిత్స చెయ్యడంతో ఆ ప్రాంతంలో కరోనా కట్టడిని సాధ్యం చెయ్యడానికి అవకాశం వచ్చింది.

Recommended Video

సీరియల్ నటి Navya Swamy వీడియో.. రూమర్లు మానసికంగా దెబ్బతీశాయి..!! || Oneindia Telugu
ధారావి ముంబై సిటీకి రోల్ మోడల్

ధారావి ముంబై సిటీకి రోల్ మోడల్

ధారావి ప్రాంతంలో దాదాపుగా కరోనా వైరస్ కట్టడి కావడంతో ఆ ప్రాంతంలో అమలు చేసిన ర్యాపిడ్ యాక్షన్ ప్లాన్ ను ముంబైలోని ఇతర ప్రాంతాల్లో అమలు చెయ్యాలని బీఎంసీ అధికారులు నిర్ణయించారు. ధారావి ప్రాంతంలో కరోనా కట్టడికి బీఎంసీ అధికారులకు వైద్యులు, పోలీసులతో పాటు భారత్ జైన్ సంఘం, దేశ్ అప్యాయ్ పౌండేషన్, క్రెడాయ్ తదితర సంస్థలు సహకరించాయి. ధారావి ప్రాంతంలో కరోనా కట్టడికి సహకరించిన సంస్థల సహాయంతోనే ముంబై సిటీలో కరోనా కట్టడికి మరన్ని చర్యలు తీసుకోవాలని బీఎంసీ అధికారులు డిసైడ్ అయ్యారు. మొత్తం మీద ఆసియాలో నే అతిపెద్ద మురికివాడగా గుర్తింపు తెచ్చుకున్న ధారావి ప్రాంతం కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి నేడు ముంబైకి రోల్ మోడల్ అయ్యింది.

English summary
Coronavirus: Mumbai Muncipal Corporation (BMC) Adopts Dharavi Model To Other Part Of The City To Control COVID-19 Cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X