కరోనా: ఇంకా ఎందర్ని చంపుతుందో! ఇండియాలో 75 మంది.. గ్లోబల్‌గా 55వేలకుపైనే..
'కరోనా' అంటే 'కిరీటం' అని అర్థం. మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు ఈ వైరస్ కిరీటం ఆకృతిలో కనిపించడంతో దానికా పేరు పెట్టారు. అలా భూగోళాన్ని కబ్జాచేసి రాజ్యంచేస్తోన్న కరోనా మహమ్మారి వేలాది మందిని బలితీసుకుంటున్నది. కొవిడ్-19 వ్యాధి కారణంగా శుక్రవారం రాత్రి నాటికి ఇండియాలో 75 మంది, ప్రపంచదేశాలన్నీ కిలిపి 55,188 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10లక్షల 40వేలు దాటింది. అందులో 2.22లక్షల మంది కోలుకున్నారు. స్పెయిన్, బ్రిటన్ లోనైతే ఒకే రోజు వందలమంది రాలిపోవడంతో శుక్రవారం డెడ్లీ ఫ్రైడేగా నమోదయింది.

ఇండియాలో పరిస్థితి ఇది..
వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్నవేళ.. పాజిటివ్ కేసుల నమోదు పెరిగింది. శుక్రవారం రాత్రి సమయానికి మొత్తం 2897 నమోదయ్యాయి. మహారాష్ట్ర(423), తమిళనాడు(411) ముందు వరసలో ఉన్నాయి. ఢిల్లీలో అనూహ్యంగా శుక్రవారం ఒక్కరోజే 91 కేసులు వెలుగులోకి వచ్చాయి. తద్వారా సంఖ్య 384కు పెరిగింది. కేరళలో కొత్త కేసులు తగ్గాయి. ప్రస్తుతం 295 దగ్గరే నిలిచింది. 44 కొత్త కేసులతో యూపీలో 172, 35 కొత్త కేసులతో రాజస్తాన్ లో 168 మంది పేషెంట్లున్నారు. ఏపీలో 161, తెలంగాణలో 154 కేసులు నమోదయ్యాయి.

ఆ నాలుగు రాష్ట్రాల్లో కేసుల్లేవు..
పెద్ద రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈశాన్యంలోని ఎనిమిది రాష్ట్రాల్లో.. అస్సాంలో 20, మణిపూర్ లో 2 కేసులు, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలో ఒక్కో కేసు నమోదుకాగా, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలో ఒక్క కేసులు కూడా నమోదుకాలేదు. ఇక తూర్పురాష్ట్రాలు జార్ఖండ్ లో 2, ఒడిశాలో 9, బిహార్ 29, వెస్ట్ బెంగాల్ లో 54 కేసులు రిజిస్టర్ అయ్యాయి.
Recommended Video

స్పెయిన్, బ్రిటన్ లో ఘోరం.. అమెరికాలోనూ..
కొవిడ్-19 మరణాలు అత్యధికంగా చోటుచేసుకుంటన్న యూరప్ లో పెద్ద దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. బ్రిటన్ లో శుక్రవారం ఒక్కరేజే 684 మంది చనిపోయారు. ప్రస్తుతం అక్కడ 38,168 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 3,605 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్ లోనూ శుక్రవారం ఒక్కరోజే 587 మంది బలయ్యారు. అక్కడ కేసుల సంఖ్య 1.18లక్షలుగా ఉంది. మొత్తం మరణాలు 11వేలకు చేరువయ్యాయి. ఇటలీలో అదృష్టవశాత్తూ కొత్త కేసులు నమోదుకాలేదు. కానీ 1.15 లక్షల పాజిటివ్ కేసులున్నాయి. అక్కడ అత్యధికంగా 13,915 మంది చనిపోయారు.అమెరికాలో కొత్త కేసులు ఉధృతి తగ్గకపోవడంతో కొవిడ్-19 పేషెంట్ల సంఖ్య 2.45లక్షలకు పెరిగింది. మరణాలు కూడా 6,098కి పెరిగాయి.












Click it and Unblock the Notifications