Coronavirus: ఐసీయూలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఫ్యామిలీ కోసం ఆసుపత్రికి వెళ్లి, అనురాద క్లారిటీ!
చెన్నై/ హైదరాబాద్: ప్రముఖ గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత ఎస్పీ. బాలసుబ్రమణ్యం కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కారణంగా చెన్నైలోని ప్రముఖ ఎంజీఎం ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇన్ని రోజులు చికిత్సకు పూర్తిగా సహకరించిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని ప్రచారం జరగడంతో ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యం ఆయన హెల్ల్ బులిటెన్ విడుదల చేసింది. సినీ సంగీత ప్రేమికులు ఎంతగానో అభిమానించే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు.
Recommended Video

కరోనా పాజిటివ్ తో కలకలం
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా పాజిటివ్ అని ఆగస్టు 5వ తేదీన వెలుగు చూసింది. తనకు కరోనా పాజిటివ్ అని వచ్చిన వెంటనే అనేక మంది స్నేహితులు, శ్రేయోభిలాషులు తనకు పదేపదే ఫోన్లు చేస్తున్నారని, గత మూడు రోజుల నుంచి అస్వస్థతకు గురైన తనకు వైద్యులు చికిత్స చేసి హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారని, తాను ఆరోగ్యంగా ఉన్నానని అదే రోజు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఓ వీడియో విడుదల చేశారు.

ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలని ఆసుపత్రికి
వైద్యులు తనను హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారని, తన వలన తన కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కోవడం ఇష్టం లేక తానే ఆసుపత్రిలో చేరుతున్నానని ఆగస్టు 5వ తేదీన ఎస్పీ బాలసుబ్రమణ్యం విడుదల చేసిన వీడియోలో వివరించారు. అప్పటి నుంచి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలోచికిత్స పొందుతున్నారు.

గురువారం రాత్రి సీరియస్
ఇన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్సకు సహకరించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైనారని సమాచారం. వెంటనే ఎస్పీ బాలసుబ్రమణ్యంను ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రణ్యం ఆరోగ్యంపై అనేక వదంతులు వ్యాపించడంతో ఆయన కుటుంబ సభ్యులు, ఆసుపత్రి వర్గాలు హడలిపోయాయి.

డాక్టర్ అనురాద క్లారిటి
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు చికిత్స అందిస్తున్న ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు శుక్రవారం సాయంత్రం ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఎంజీఎం ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనురాద బాస్కరన్ పేరుతో విడుదలైన బులిటెన్ లో ఎస్సీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని క్లారిటీగా ఉంది. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు ఐసీయూలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని, ఆయన త్వరగా కోలుకుంటారని మాకు నమ్మకం ఉందని ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. తాము ఎంతగానో ఆరాధించే గాయకుడు ఎస్పీ. బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సన్నిహితులు, సాటి గాయనీ గాయకులు దేవుడిని వేడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications