Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Coronavirus: పెళ్లి రోజే పోలీసు ప్రాణం బలి తీసుకున్న కరోనా, హోమ్ క్వారంటైన్ చికిత్స !

బెంగళూరు/ మైసూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బ నుంచి సామాన్య ప్రజలను కాపాడుతున్న వైద్యులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీసులు, పారిశుద్ద కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వందల మంది వైద్యులు, పోలీసులు, వైద్యశాఖ సిబ్బంది, పారిశుద్ద కార్మికులు వారి ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడుతున్నారు. కరోనా వారియర్స్ టీంలోని ఓ పోలీసు కరోనా కాటుకు పెళ్లి రోజే ప్రాణాలు వదలడంతో ఆయన కుటుంబంలో విషాదచాయలు నెలకొన్నాయి. హోమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న పోలీసు తీవ్రఅస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తీసుకెలుతుంటే ప్రాణాలు పోయాయి.

 కరోనా వారియర్స్

కరోనా వారియర్స్

కర్ణాటకలో కరోనా రోగులు కాపాడటంలో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఆ మహమ్మారి వ్యాధి బలి తీసుకుంటున్నది. ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు నగరంలో కరోనా వైరస్ దెబ్బతో అనేక పోలీస్ స్టేషన్లు సీల్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ తో పోరాటం చేస్తున్న పోలీసులు కరోనా వారియర్స్ గా గుర్తింపు తెచ్చుకుని విధులు నిర్వహిస్తున్నారు.

 మహదేవ స్వామికి కరోనా పాజిటివ్

మహదేవ స్వామికి కరోనా పాజిటివ్

కర్ణాటకలోని చామరాజనగర జిల్లా (తమిళనాడు బార్డర్)లోని గుండ్లుపేట తాలుకా సోమహళ్ళి గ్రామంలో నివాసం ఉంటున్న మహదేవస్వామి (38) చామరాజనగర గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. గత నాలుగు నెలల నుంచి శక్తివంచన లేకుండా పని చేస్తున్న కానిస్టేబుల్ మహదేవస్వామి ఈనెల 12వ ఆనారోగ్యానికి గురైనాడు. వెంటనే మహదేవస్వామి వైద్యపరీక్షలు చేయించుకోవడంతో ఆయనకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది.

 హోమ్ క్వారంటైన్ లో చికిత్స

హోమ్ క్వారంటైన్ లో చికిత్స

కరోనా పాజిటివ్ అని వెలుగు చూసిన వెంటనే కానిస్టేబుల్ మహదేవస్వామిని హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకు ఈనెల 12వ తేదీ నుంచి హోమ్ క్వారంటైన్ లో కానిస్టేబుల్ మహదేవస్వామి క్రమం తప్పకుండా వైద్యులు ఇచ్చిన మందులు వేసుకుని త్వరగా వ్యాధి నుంచి కోలుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

Recommended Video

    India’s Overall Growth For 2020-21 Projected at Minus 4.5%: RBI || Oneindia Telugu
     పెళ్లి రోజే ప్రాణాలు పోయాయి

    పెళ్లి రోజే ప్రాణాలు పోయాయి

    హోమ్ క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ మహదేవస్వామి బుధవారం సాయంత్రం శ్వాసకోస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే మహదేవస్వామిని ఆసుపత్రికి తరలించడానికి ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. ఆసుపత్రికి చేరుకునే సమయంలోనే మహదేవస్వామి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బుధవారం కానిస్టేబుల్ మహదేవస్వామి నాలుగవ వివాహ వార్షికోత్సవం జరుపుకోవడానికి అతని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మ్యారేజ్ డే వేడుకలు జరుపుకునే గంట ముందు అనారోగ్యానికి గురైన కానిస్టేబుల్ మహదేవస్వామి అదే రోజు ప్రాణాలు విడిచిపెట్టడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+