కరోనా కల్లోలం: వైరస్ వ్యాపిస్తుంటే సోషల్ మీడియా గోల ఏంటీ..? రాహుల్ గాంధీ ఫైర్, మోడీ ఆన్సర్..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వైరస్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తన సోషల్ మీడియా ఖాతా నుంచి వైదొలుగుతానని సమయం వృధా చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భయానక వైరస్ ప్రబలిన కేసులు పెరుగుతుంటే.. నిజమైన లీడర్ దానిని అరికట్టడంపై దృష్టిసారిస్తారు అని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. వైరస్ ప్రబలి దేశంలోని ప్రజలను, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా వైరస్‌కు సంబంధించి రాహుల్ గాంధీ పోస్ట్ చేయడానికి కొన్ని నిమిషాల ముందు ప్రధాని మోడీ తన సోషల్ మీడియా ఖాతా నుంచి వైదొలగడంపై మరోసారి ట్వీట్ చేశారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పబొతున్నట్టు పేర్కొన్నారు. కానీ దీనిపై లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అదిర్ రంజన్ చౌదరి కూడా స్పందించారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్ల నుంచి దృష్టి మరల్చేందుకు మోడీ సోషల్ మీడియా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు.

కరోనా వైరస్ మహమ్మరి వ్యాపిస్తోందని.. అప్రమత్తంగా ఉండాలని ఫిబ్రవరి 12వ తేదీన తాను అప్రమత్తం చేశానని.. కానీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఆ రోజు నాటి ట్వీట్‌ను కూడా రాహుల్ ట్యాగ్ చేశారు. కరోనా వైరస్‌పై రాహుల్ గాంధీ ట్వీట్‌పై ప్రధాని మోడీ రియాక్టయ్యారు. వైరస్‌పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్పారు. అంతగా భయపడాల్సిన అవసరం లేదని.. అందుకోసం కలిసి పనిచేద్దామని సూచించారు. అన్నింటికంటే ముఖ్య జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Recommended Video

కరోనా వైరస్ సోకిన మృతిచెందిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 3 వేల మందికి పైగా చనిపోయారు. ఇందులో సింహభాగం చైనాకు చెందినవారే. 86 వేల మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.












Click it and Unblock the Notifications