బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Shame shame: సామూహిక అంత్యసంస్కారాలకు స్వాగతం ఫ్లెక్సీలు, ప్రధాని, సీఎం పరువు తీసేశారు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మనిషికి పైత్యం నషాలానికి ఎక్కితే ఎలాగుంటుందో చెప్పడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు అనే పెద్దల సామెత మరోసారి రుజువు అయ్యింది. రాజకీయ నాయకుల ప్రచారాని హద్దు పొద్దులతో పాటు అడ్డూఅదుపులేకుండాపోతుంది. కరోనా సెకండ్ వేవ్ తో భారతదేశం మొత్తం హడలిపోతుంది. ఇప్పుడు ఉండే మనిషి మరో గంటకు ఉంటాడు అని గ్యారెంటీ లేకుండా పోయింది. అంత్యసంస్కారాలు చెయ్యడానికి స్మశానాలు సరిపోవడం లేదు. ఇలాంటి సమయంలో సామూహిక అంత్యసంస్కారాలు చేస్తున్న చోట అధికార పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. సామూహిక అత్యసంస్కారాలకు వస్తున్న వారికి స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో, ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తున్నాము, మీకు నీళ్లు, టీలు, కాఫీలు, టిఫిన్ లు, భోజనాలు ఫ్రీ అంటూ ప్రకటనలు ఇచ్చేశారు. ధరిద్రం ఏమిటంటే అలాంటి ఫ్లెక్సీల్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం నవ్వుతూ ఉన్న ఫోటోలు వెయ్యడం దూమరం రేపింది. మీకు సిగ్గు షరం... మానం మర్యాద ఏమైనా ఉన్నాయా ? అంటూ ప్రజలు ఆ రాజకీయ నాయకులకు చివాట్లు పెడుతున్నారు.

Illegal affair: కొబ్బరి తోటలో ఆంటీ లవ్ స్టోరీ, యజమానికి తెలిసిందని ?, ప్రియుడి స్కెచ్ !Illegal affair: కొబ్బరి తోటలో ఆంటీ లవ్ స్టోరీ, యజమానికి తెలిసిందని ?, ప్రియుడి స్కెచ్ !

ఐటీ హబ్ లో హౌస్ ఫుల్ బోర్డులు

ఐటీ హబ్ లో హౌస్ ఫుల్ బోర్డులు

ప్రపంచ దేశాల్లో ఐటీ హబ్ గా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు నగరంలో వారం రోజుల నుంచి సంపూర్ణ లాక్ డౌన్ అమలులో ఉంది. బెంగళూరులో లాక్ డౌన్ అమలులో ఉన్నా కరోనా వైరస్ దెబ్బకు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కరోనా వైరస్ (COVID-19)తో ప్రాణాలు పోయిన వారి అంత్యసంస్కారాలు చెయ్యడానికి స్మశానాల్లో ఖాళీ లేకపోవడంతో ఇప్పటికే హౌస్ ఫుల్ బోర్డులు తగిలించడం కలకలం రేపాయి.

సిటీ శివారల్లో సామూహిక అత్యంసంస్కారాలు

సిటీ శివారల్లో సామూహిక అత్యంసంస్కారాలు

బెంగళూరులోని వివిద ప్రాంతాల్లో కోవిడ్ పాజిటివ్ తో చనిపోయిన వారి శవాలను సిటీ శివార్లలోకి తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తున్నారు. సిటీ శివార్లలో కూడా సమయం లేకపోవడం, సక్రమంగా స్థలాలు లేకపోవడంతో సామూహిక అంత్యసంస్కారాలు చేసేస్తున్నారు. ఇటీవల బెంగళూరు నగర శివార్లలో ఒకే సారి 12 శవాలకు సామూహిక అత్యసంస్కారాలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

 ఏం పబ్లిసిటిరా బాబు..... ఖర్మ కాకపోతే !

ఏం పబ్లిసిటిరా బాబు..... ఖర్మ కాకపోతే !

బెంగళూరు నగర శివార్లలోని గిడ్డేనహళ్లి ప్రాంతంలో కర్ణాటక ప్రభుత్వం కోవిడ్ వ్యాధితో మరణించిన వారి అంత్యసంస్కారాలు చెయ్యడానికి ఏర్పాట్లు చేసింది. బెంగళూరులో కోవిడ్ పాజిటివ్ తో చనిపోయిన వారిని గిడ్డేనహళ్ళి ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ సామూహిక అంత్యసంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ బీజేపీకి చెందిన కొందరు నాయకులు సామూహిక అత్యసంస్కారాలకు వస్తున్న వారి కోసం ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చెయ్యడంతో దూమరం రేపింది.

స్వాగతం..... నీళ్లు, కాఫీలు, టీలు, టిఫిన్లు, భోజనాలు ఫ్రీ.... ఫ్రీ.... ఫ్రీ

స్వాగతం..... నీళ్లు, కాఫీలు, టీలు, టిఫిన్లు, భోజనాలు ఫ్రీ.... ఫ్రీ.... ఫ్రీ

సామూహిక అత్యసంస్కారాలకు వస్తున్న వారికి స్వాగతం, ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ కోవిడ్ పాజిటివ్ తో చనిపోయిన వారికి అంత్యసంస్కారాలు నిర్వహిస్తున్నాము. ఇక్కడ మీకు ఇక్కడ ఉచితంగా నీళ్లు, కాఫీలు, టీలు, టిఫిన్లు, భోజనాలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశాము అంటూ పెద్దపెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పనిలోపనిగా స్థానిక బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే ఎస్ఆర్. విశ్వనాథ్ నవ్వుతూ ఉన్న ఫోటోలు ఆ ఫ్లెక్సీల్లో పెట్టడం తీవ్రవిమర్శలకు దారితీసింది.

ప్రధాని, సీఎం పరువు తీసేశారు

ప్రధాని, సీఎం పరువు తీసేశారు

అంత్యసంస్కారాలకు వస్తున్న వారి కోసం నెలమంగల యోజనా ప్రాధికార అధ్యక్షుడు ఎస్. మల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, స్థానిక ఎమ్మెల్యే ఎస్ఆర్. విశ్వనాథ్ తదితరులు చిరునవ్వుతో ఉన్న ఫోటోలు పెట్డడంతో స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతున్న సామూహిక అంత్యసంస్కారాలు అని ఫ్లెక్సీలు పెట్టడంతో అనేక విమర్శలు ఎదురౌతున్నాయి.

మీకు సిగ్గు.... షరం.... మానం.... మర్యాద ఏమైనా ఉన్నాయా ?

మీకు సిగ్గు.... షరం.... మానం.... మర్యాద ఏమైనా ఉన్నాయా ?


బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీకు మీకు సిగ్గు.... షరం.... మానం.... మర్యాద ఏమైనా ఉన్నాయా ?, శవరాజకీయాలు, ఫ్రీ పబ్లిసిటీలు చెయ్యడానికి మీకు కరోనా వైరస్ మాత్రమే చిక్కిందా అంటూ మండిపడుతున్నారు. ప్రతిపక్షాలతో పాటు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకావడంతో ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీజేపీ నాయకులు తొలగిస్తున్నారు.

అమ్మతోడు..... నాకేమి తెలీదు దేవుడా

అమ్మతోడు..... నాకేమి తెలీదు దేవుడా

కోవిడ్ మృతుల అంత్యసంస్కారాలు జరుగుతున్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు తనకు, సీఎం, ప్రధానికి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్థానిక ఎమ్మెల్యే ఎస్ఆర్. విశ్వనాథ్ ఆయన్ను కలిసిన విలేకరులతో అన్నారు. కోవిడ్ మృతుల అంత్యసంస్కారాలు జరుగుతున్న ప్రాంతంలో తాగడానికి నీళ్లు కూడా చిక్కడం లేదని, అక్కడ అన్ని గుట్టలు, బండరాళ్లు ఉన్నాయని, అక్కడికి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకూడదని తాను నీళ్లు, టీలు, టిఫిన్లు, భోజనాలు పంపిణి చెయ్యాలని చెప్పానని, ఫ్లెక్సీలు ఏర్పాటు చెయ్యడం భాదాకరంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే, బెంగళూరు డెవలప్ మెంట్ అథారిటి (BDA) అధ్యక్షుడు ఎస్ఆర్. విశ్వనాథ్ విచారం వ్యక్తం చేశారు. మొత్తం మీద కోవిడ్ చావులతో రాజకీయాలు చెయ్యాలని ప్రయత్నించిన కొందరు నాయకులకు సోషల్ మీడియాలో నెటిజన్లు చివాట్లు పెడుతున్నారు.

English summary
Coronavirus: COVID-19 cremation flex, Karnataka BJP leaders politics in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X