ఆ మందులు ఎగుమతే, ఇక్కడ వాడలే, మైడెన్ ఫార్మా ఉత్పత్తులపై కేంద్రం
మైడెన్ ఫార్మాకు సంబంధించి దగ్గు మందు ఉత్పత్తులతో గాంబియాలో ఇప్పటికే 66 మంది చిన్నారులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మందు దేశంలో.. ఇతర దేశాల్లో సరఫరా జరిగిందా..? వినియోగించారా అనే సందేహాలు కలుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
గాంబియా ఘటనకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేయడంతో మైడెన్ ఫార్మా ఉత్పత్తులు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ మందులను విదేశాలకు ఎగుమతి చేశామే తప్ప.. ఇక్కడ వాడలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దాంతోపాటు హర్యానాలో ఉత్పత్తి అయినా మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన నాలుగు డ్రగ్స్.. టెస్ట్కోసం పింపించామని పేర్కొంది.

ఆ చిన్నారుల మరణానికి నిజమైన కారణం ఏంటో కనుగోనాలని ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరింది. అలాంటి ఉత్పత్తులను వాడే ముందు.. పరీక్షించే దేశాలకు దిగుమతి చేసుకునేందకు అవకాశం ఇవ్వాలని కోరింది.
గాంబియాలో ఘోర విషాదం జరిగిన సంగతి తెలిసిందే. దగ్గు సిరప్ వల్ల దేశంలో 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారుచేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లే పిల్లల్లో తీవ్రమైన కిడ్నీ వ్యాధులు, 66 మంది చిన్నారుల మృతికి కారణమయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ప్రొమెథజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్స్‌మాలిన్ బేబీ కఫ్ సిరప్, మేకాఫ్ బేబీ కఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ అనే నాలుగు ఔషధాలపై డబ్ల్యూహెచ్‌వో మెడికల్ ప్రొడక్ట్ అలర్ట్ జారీచేసింది. పరిమితికి మించి డైథిలిన్ గ్లైకోల్, ఇథిలిన్ గ్లైకోల్ ఉన్నట్టు గుర్తించారు. పరిమితి దాటితే విషపూరితంగా మారుతాయని తెలియజేసింది.
గాంబియా దుర్ఘటనపై సంబంధిత భారత రెగ్యులేటరీ అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. ఉత్పత్తులు సురక్షితం కాదని, వాటి ఉపయోగం మరణాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ ప్రొడక్టులను గుర్తించి, అమ్మకాల నుంచి తప్పించాలని సూచించింది.












Click it and Unblock the Notifications