బెంగళూరులో భార్యతో కలిసి రైలు కిందపడిన న్యాయవాది, మృ తి, బంధువు ఇంటిలో కుమార్తె!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: జీవితంపై విరక్తి పెంచుకున్న న్యాయవాది, ఆయన భార్య వేగంగా వెలుతున్న రైలు కిందపడ్డారు. తీవ్రగాయాలైన భార్య సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందింది. తీవ్రగాయాలైన న్యాయవాది బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బెంగళూరులోని చెల్లఘట్ట ప్రాంతంలో మంజునాథ్ (35), శ్వేత (29) దంపతులు నివాసం ఉంటున్నారు. మంజునాథ్, శ్వేత దంపతులకు కుమార్తె (3) ఉంది. మంజునాథ్ బెంగళూరు నగరంలో న్యాయవాదిగా పని చేస్తున్నాడు. పాపను బంధువు ఇంటిలో వదిలిన మంజునాథ్, శ్వేత దంపతులు ఇంటి నుంచి బయటకు వెళ్లారు.

Couple committed suicide wife died husband serious in Bengaluru

బెంగళూరు-మైసూరు రహదారిలోని ఆర్.వీ. ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోకి వెళ్లారు. బెంగళూరు-మైసూరు వెలుతున్న టిప్పు ఎక్స్ ప్రెస్ రైలు కింద మంజునాథ్, శ్వేత దంపతులు పడ్డారు. తీవ్రగాయాలైన శ్వేత సంఘటనా స్థలంలోనే మరణించింది. అటు వైపు వెలుతున్న వారు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంజునాథ్ ను రక్షించి ఆసుపత్రికి తరలించారు. దంపతులు ఎందుకు రైలు కిందపడ్డారు అనే విషయం ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Couple committed suicide wife died husband serious in Bengaluru in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి