కేరళ నర్సు, యువకుడు బెంగళూరు లాడ్జిలో ఆత్మహత్య
బెంగళూరు: కేరళకు చెందిన ఓ యువకుడు, ఓ యువతి కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ఓ లాడ్జిలో విగత జీవులుగా కనిపించారు. వారు ఇద్దరు ప్రేమికులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వారు తాము అద్దెకు తీసుకున్న గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది కాటన్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఉంది.
పోలీసులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు జితేష్ (25), షీను (22). వారిద్దరు కూడా కేరళలోని పలక్కాడుకు చెందిన వారిగా గుర్తించారు. వారు ఆదివారం ఉదయం నాలుగున్నర గంటల సమయంలో లాడ్జికి వచ్చారు. వారు తమ గదుల్లోకి వెళ్లాక ఎంతసేపటకి బయటకు రాలేదు.

దీనిని గుర్తించిన లాడ్జి మేనేజర్ ఓ రూం బాయ్‌ను వారి గదికి పంపించాడు. సదరు రూం బాయ్ మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో గదికి వెళ్లాడు. లోపలి నుండి ఎలాంటి స్పందన లేదు. ఇదే విషయాన్ని అతడు హోటల్ మేనేజర్‌కు చెప్పాడు.
వెంటనే హోటల్ మేనేజర్ ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. లాడ్జికి వచ్చిన పోలీసులు తలుపులను బద్దలు కొట్టారు. లోపలకు వెళ్లగా.. అక్కడ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని యువతీ, యువకుడు కనిపించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
వారి మృతదేహాల వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే, ఆ యువతిని నర్సింగ్ స్టూడెంట్‌గా గుర్తించారు. యువకుడు కూడా విద్యార్థిగా భావిస్తున్నారు.
ఈ విషయమై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం పలక్కాడులో మిస్సింగ్ కేసు నమోదయింది తెలిపారు. వీరే అయి ఉంటారని అన్నారు. వారు అక్కడి నుండి పారిపోయి వచ్చి ఉంటారన్నారు. బెంగళూరుకు వచ్చేకంటే ముందు వారు ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుల తల్లిదండ్రులను ప్రశ్నించిన తర్వాతే విషయం తెలుస్తుందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications