లోదుస్తులతో వచ్చారు: కట్టేసి కొట్టి ఇద్దరి హత్య, ఇద్దరిపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: నలుగురైదుగురు దోపిడీదారులు రెండు ఇళ్లలో బీభత్సం సృష్టించారు. మూడు గంటల పాటు అతి దుర్మార్గంగా వ్యవహరించారు. బుధవారం అర్ధరాత్రివేళ ఇంటి ప్రాంగణంలోకి చొరబడ్డారు. ఆరుబయట నిద్రిస్తున్న ఆ ఇంటివారిని బాలిక చున్నీతో కట్టేసి ఇనపరాడ్లతో దారుణంగా కొట్టారు.
ఆ దెబ్బలతో ఒక జంట మరణించింది. ఇదంతా జరుగుతుండగానే ముగ్గురు దుండగులు ఇంట్లోకి వెళ్లి ఒక వివాహితపైనా, పదహారేళ్ల బాలికపైనా సామూహిక అత్యాచారం చేశారు. హర్యానాలోని మేవాట్ జిల్లాలో గల దింగర్‌హెరి గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచార బాధితుల్లో ఓ మహిళ వివాహితురాలు కాగా, మరో బాధితురాలు మైనగర్ బాలిక.

దారుణానికి పాల్పడిన దుండగులంతా లోదుస్తులు మాత్రమే ధరించి ఉన్నారని, ఒంటికి నూనె పూసుకుని ఉన్నారని, వారిలో ఒకరి వద్ద నాటు తుపాకీ ఉందని అత్యాచార బాధితుల్లో ఒకరు చెప్పారు. ఇల్లంతా వెతికి విలువైన వస్తువులను, రెండు మోటార్‌సైకిళ్లను ఎత్తుకుపోయారని తెలిపారు.
కచ్చాగ్యాంగ్ దుండగులే ఈ దుర్మార్గానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో అక్కడి నుంచి తప్పించుకున్న కుటుంబసభ్యుడొకరు ఊళ్లోకి వెళ్లి గ్రామస్థులకు విషయం తెలిపారు. వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజాము సమయానికి ఆ ఇంటికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి అత్యాచార బాధితులిద్దరూ తలకు గాయాలతో మంచంవద్ద పడి ఉన్నారు.
మరో ఐదుగురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాన్ని నియమించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications