వికటించిన సాహసం : బ్రిడ్జిపై బైక్ మీద కపుల్, పెరిగిన ప్రవాహం.. ఏం జరిగిందంటే..!!
ముంబై : మహారాష్ట్రలో ఇటీవల భారీ వర్షాలు కురిసాయి. ముంబై మహానగరం గురించి అయితే చెప్పక్కర్లేదు. వరదనీటితో వీధులు నదులను తలపించాయి. నగర సమీపంలో కూడా వర్షం కురిసింది. అయితే నవీ ముంబై సమీపంలో గడి నది పొంగి ప్రవహిస్తోంది. నదిపై బ్రిడ్జ్ కూడా ఉంది. అయితే దానికి రైలింగ్ లేకపోవడం .. వరదనీరు బ్రిడ్జిపై నుంచి వెళ్లడంతో అటుగా వెళ్లేందుకు ఎవరూ సాహసించారు. కానీ ఓ జంట వెళ్లేందుకు ప్రయత్నం చేసి .. కొట్టుకుపోయింది.
బ్రిడ్జే కదా అని వెళితే ..
ఉమ్రోలి గ్రామ సమీపంలోని మాధరన్ రోడ్ వద్ద బ్రిడ్జి ఉంది. దానిపై నుంచి గడి రివర్ పారుతూ ఉంటుంది. సాధారణ సమయంలో అయితే నీరు తక్కువగా ఉంటుంది. కానీ ఇటీవల కురిసిన వర్షాలతో పొంగి పొర్లుతుంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 7.30 గంటలకు ఓ జంట సాహసం చేసింది. బ్రిడ్జీ దాటేందుకు ప్రయత్నం చేసింది. ఆదిత్య ఆమ్రే, సారిక ఆమ్రే అనే దంపతులు తమ బైక్‌పై బ్రిడ్జి నుంచి దాటుదామని ట్రై చేశారు. అయితే అప్పటికే బ్రిడ్జిపై నుంచి కొద్దిగా వెళ్తున్న నీరు ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆ ప్రవాహంలో వారు కొట్టుకుపోయారు. అయితే బ్రిడ్జి చివరలో రైలింగ్ కూడా లేదు. అలా ఉంటే అయినా వారు పట్టుకునేందుకు అవకాశం ఉండేది.

ఎక్కువైన ప్రవాహం ..
బ్రిడ్జిపై నుంచి వరదనీరు ఎక్కువై జంట కొట్టుకుపోవడాన్ని స్థానికులు చూసి .. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. నదిలో కొట్టుకుపోయిన దంపతుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆ దంపతులు ఈ ప్రాంతానికి చెందినవారు కాదని అధికారులు చెప్తున్నారు. వారు ఇటీవలే ఓ ఇంట్లో అద్దెకు తీసుకుని ఉంటున్నారని తెలిసిందని తెలిపారు. వారి ఆచూకీ కనుగొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications