వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉదయ్‌పూర్ హోటల్ సేల్: అరుణ్ శౌరీపై క్రిమినల్ కేసుకు సీబీఐ కోర్టు ఆదేశం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీతోపాటు, ప్రభుత్వ మాజీ ఉద్యో ప్రదీప్ బైజల్, హోటలియర్ జ్యోత్న్సా సూరీపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గురువారం సీబీఐ కోర్టు ఆదేశించింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లక్ష్మీవిలాస్ ప్యాలెస్ హోటల్‌లో పెట్టిన పెట్టుబడుల్లో అవినీతి జరిగిందన్న కేసులో అరుణ్ శౌరీని సీబీఐ ప్రత్యేక కోర్టు నిందితుడిగా పేర్కొంది.

ఈ హోటల్ అమ్మకాన్ని తిరిగి ప్రారంభించాలని సీబీఐ కోర్టు సూచించింది. అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో పెట్టుబడుల మంత్రిగా అరుణ్ శౌరీ ఉన్న సమయంలో ప్రభుత్వానికి భారీ నష్టంతో ఈ హోటల్‌ను విక్రయించినట్లు గుర్తించింది.

హోటల్ లక్ష్మీవిలాస్ ప్యాలెస్ విలువ రూ. 252 కోట్లకు పైగా ఉండగా.. కేవలం రూ. 7.5 కోట్లకు అమ్ముడైందని కోర్టు తీర్పులో పేర్కొంది. కాగా, సీబీఐ కోర్టు తీర్పుపై రాష్ట్ర హైకోర్టుకు వెళతానని అరుణ్ శౌరీ తెలిపారు.

 Court orders FIR against ex-minister Arun Shourie for Udaipur hotel sale

లక్ష్మీవిలాస్ ప్యాలెస్ హోటల్ చరిత్ర చూసినట్లయితే.. ఈ హోటల్ ఉదయ్‌పూర్ రాజులకు చెందినది. ఫతేసాగర్ ఒడ్డున్న ఉన్న ఈ ప్యాలెస్‌ను.. రాజరిక పాలన చివరి రోజుల్లో ప్రభుత్వానికి అప్పగించారు. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఈ ప్యాలెస్‌ను ప్రభుత్వం హోటల్‌గా నడిపింది.

కాగా, 2002లో ఈ హోటల్‌ను లలిత్ సూరి గ్రూప్ హోటల్స్ కొనుగోలు చేసింది.
ఆ సమయంలోనే కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని అభియోగాలు నమోదయ్యాయి. కాగా, సరైన ఆధారాలు లేవని 2019లో సీబీఐ కేసు మూసివేతకు నివేదిక సిద్ధం చేయగా.. సీబీఐ కోర్టు ఈ నివేదికను తిరస్కరించింది. అంతేగాక, తదుపరి దర్యాప్తునకు ఆదేశించింది. కాగా, లలిత్ సూరి మరణాంతరం లలిత్ లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ను, సంస్థ బాధ్యతను జ్యోత్సా సూరి తీసుకున్నారు.

English summary
A special court here has asked the CBI to file cases against former Union minister Arun Shourie and the then disinvestment secretary Pradip Baijal over the sale of an ITDC hotel, allegedly at a loss of Rs 244 crore to the exchequer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X