• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Covaxin:హైదరాబాద్ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలపడంపై నిపుణులు అభ్యంతరం..ఎందుకు..?

|

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం నడుస్తున్న టాపిక్ కరోనావైరస్ వ్యాక్సిన్. ఇప్పటికే రెండు వ్యాక్సిన్‌లకు భారత ఔషధ నియంత్రణ జనరల్ సంస్థ ఆమోదం తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్‌లను వినియోగించేందుకు అనుమతించింది. ఈ వ్యాక్సిన్‌లకు అనుమతి రావడం గొప్ప విషయమని ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు కేంద్రమంత్రులు కొనియాడారు. అయితే మన హైదరాబాదులో భారత్‌ బయోటెక్ కంపెనీ నుంచి తయారవుతున్న కొవాగ్జిన్‌‌కు అనుమతి ఇవ్వడంపై పలువురు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

  Covaxin Emergency Use:India approves Serum-Oxford, Bharat Biotech's COVID vaccines for Emergency Use
   మూడో దశ ట్రయల్స్‌లో కొవాగ్జిన్

  మూడో దశ ట్రయల్స్‌లో కొవాగ్జిన్

  ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీరం ఇన్స్‌టిట్యూట్ తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కు అదే సమయంలో భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవాగ్జిన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే తొలి దశ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి కొవాగ్జిన్ ఫలితాలు కచ్చితత్వంతో ఉన్నప్పటికీ ఇంకా మూడో దశ ఫలితాలు రానందున కొవాగ్జిన్‌కు ఎలా అనుమతులు ఇస్తారని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నవంబర్‌లో ప్రారంభమైన మూడోదశ ట్రయల్స్‌కు సంబంధించిన సమాచారం ఇంకా రాలేదు. వైరస్ దాడిని వ్యాక్సిన్ ఏమేరకు అడ్డుకుంటుందో చెప్పేదే ఎఫీకసీ డేటా.

  డీసీజీఐ ఏం చెప్పింది.. ఏం జరిగింది

  డీసీజీఐ ఏం చెప్పింది.. ఏం జరిగింది

  డీసీజీఐ సెప్టెంబర్‌లో వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు కొన్ని సూచనలు చేసింది. సురక్షితం, కచ్చితత్వం ఉంటేనే వ్యాక్సిన్‌లకు అనుమతి ఇస్తామని డీసీజీఐ స్పష్టంగా చెప్పింది. వ్యాక్సిన్ సురక్షితమో కాదో అని చెప్పేందుకు రెండు నెలల పాటు దానిపై వర్కౌట్ చేయాల్సి ఉంటుందని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ వ్యాక్సిన్ సైంటిస్ట్ అయిన డాక్టర్ గగన్ దీప్ కంగ్ చెప్పారు. కొవాగ్జిన్ పరిస్థితి చూస్తూ ఇప్పటి వరకు మూడో దశకు సంబంధించి ఎన్‌రోల్‌మెంట్ జరగలేదు. అలాంటప్పుడు సురక్షితంగా ఉందంటూ ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో కచ్చితత్వం కూడా చెప్పలేమని అన్నారు.

  కచ్చితత్వం లేకుంటే పరిస్థితి ఏంటి..?

  కచ్చితత్వం లేకుంటే పరిస్థితి ఏంటి..?

  భారత్‌లో తయారయ్యే కొవాగ్జిన్ ఇతర దేశాలకు కూడా సరఫరా అవుతుంది కాబట్టి ముందుగా ఈ వ్యాక్సిన్ సురక్షితం, కచ్చితత్వంపై సమాచారం సేకరించాల్సి ఉంటుందని వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ చెప్పారు. అత్యవసర వినియోగంకైనా సరే కచ్చితత్వ సమాచారం ఉండాలని చెప్పారు. భారత సంస్థలు తయారు చేసే వ్యాక్సిన్‌లపై ఇతర దేశాలకు నమ్మకం విశ్వాసం ఉన్నాయని, ఇక్కడ విఫలమైతే తయారు చేసే కంపెనీలకు నష్టం తప్పదని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉంటే కొవాగ్జిన్‌కు ఎందకు అప్రూవల్ ఇవ్వాల్సి వచ్చిందో వివరించారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా.

   సీరం వ్యాక్సిన్ సరిపోకుంటేనే...

  సీరం వ్యాక్సిన్ సరిపోకుంటేనే...

  అత్యవసర పరిస్థితుల్లో లేదా భారత్‌లో కరోనావైరస్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తే... సీరం ఇన్స్‌టిట్యూట్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ సరిపోకుంటే... ఆ సమయంలో కొవాగ్జిన్‌ను వినియోగించేందుకు మాత్రమే ఆమోదం ఇవ్వడం జరిగిందని డాక్టర్ గులేరియా చెప్పారు. అది కూడా క్లినికల్ ట్రయల్‌‌లో భాగంగానే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఎలాగూ సీరం ఇన్స్‌టిట్యూట్ 50 మిలియన్ డోసులను సిద్ధం చేసిందని ప్రకటించింది కాబట్టి, భారత్ బయోటెక్ సంస్థ చేసిన కొవాగ్జిన్‌కు తొందరేమీ లేదని చెప్పారు జమీల్. మూడవ దశ ట్రలయ్స్ నిర్వహించాకే వచ్చిన సమాచారంను సేకరించాకే అనుమతి ఇచ్చి ఉంటూ బాగుండేదనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు.

  ఇదిలా ఉంటే వ్యాక్సిన్ తీసుకుంటున్న వ్యక్తితో సమస్య కాదని... విధానపరమైన నిర్ణయం, నియంత్రణ స్థాయిలోనే సమస్య తలెత్తిందని అన్నారు మరో ఇమ్యూనాలజిస్ట్ సత్యజిత్ రథ్. కొవాగ్జిన్‌కు అనుమతులు పలు రకాలుగా ఇచ్చారని వీటిపైనే అనుమానంగా ఉందని చెప్పారు. ఇది ఒకవేళ విఫలమైతే ప్రజలు ఈ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ పై విశ్వాసం కోల్పోతారని హెచ్చరించారు.

  English summary
  Experts question as how the approval was given when the efficacy data for Covaxin was missing.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X