వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చేనెలలోనే కరోనా చిన్నారుల వ్యాక్సిన్- కోవాగ్జిన్ బ్రాండ్- ముందుగా వీరికే అందుబాటులోకి

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా ధర్డ్ వేవ్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులకు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాదీ సంస్ధ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ చిన్నారుల వ్యాక్సిన్ కు ఇప్పటికే మన దేశంలో అత్యవసర వాడకం కోసం అనుమతి కూడా ఇచ్చేసింది. దీంతో కోవాగ్జిన్ చిన్నారుల వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది.

Recommended Video

చిన్నారులకు Covid-19 Vaccine వచ్చేసిందోచ్.. ఎప్పటినుంచి అంటే...! || Oneindia Telugu

కోవాగ్జిన్ చిన్నారుల వ్యాక్సిన్ పై ఇప్పటికే భారత్ బయోటెక్ మూడు దశల ప్రయోగాలు చేపట్టింది. వీటిలో సత్ఫలితాలు రావడంతో దీన్ని భారత్ లో అత్యవసర వాడకం కోసం డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చింది. పిల్లలకు కోవిడ్ -19 టీకా డ్రైవ్ నవంబర్ ద్వితీయార్ధం నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని న్యూస్ 18 వెల్లడించింది.

covaxin kids vaccine may roll out in next month, priority for week immunity

ఔషధ నియంత్రణ సంస్థ కింద పనిచేస్తున్న సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (SEC) 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ ఉపయోగించడాన్ని తాజాగా ఆమోదించింది. ఈ డ్రైవ్ మొదట దీర్ఘకాలిక లేదా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్న పిల్లలకు ఉపయోగపడుతుంది; వ్యాధుల ప్రాధాన్య జాబితా సిద్ధం కావడానికి మూడు వారాలు పట్టవచ్చని తెలుస్తోంది.

నిపుణుల కమిటీ ఇచ్చిన అనుమతుల్ని డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా తుది పరిశీలన చేసి అనుమతించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. అది పూర్తి కాగానే వచ్చే నెల నుంచి ఈ చిన్నారుల వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు భారత్ బయోటెక్ సిద్ధమవుతోంది. ముందుగా ఈ వ్యాక్సిన్ ఎవరెవరికి ఇవ్వాలనే విషయంలోనూ భారత్ బయోటెక్ స్పష్టతతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డ్రగ్ కంట్రోలర్ అనుమతి తర్వాత జాతీయ టెక్నికల్ సలహా కమిటీ కూడా పరిశీలన పూర్తి చేసి పూర్తిస్దాయి అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీయే వ్యాక్సిన్ ఎవరెవరికి ఇవ్వాలనే విషయాన్ని నిర్ధారించనుంది. వీరికే భారత్ బయోటెక్ ముందుగా వ్యాక్సిన్ సరఫరా చేయాల్సి ఉంటుంది.

English summary
covid 19 kids vaccine from bharat biotech may roll out from novermber this year, according to central govt sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X