Bengaluru: ఐటీ హబ్ లో ఏం జరుగుతోంది, హడల్, కొత్తగా 5 జోన్లు, దేవుడా... నువ్వే కాపాడు !
బెంగళూరు/ ముంబాయి: ఐటీ, బీటీ సంస్థల దేశరాజధాని బెంగళూరు సిటీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఐటీ హబ్ బెంగళూరులో కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రజలు అధికారులు సహకరించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. బెంగళూరులో కొత్తగా మరో ఐదు కంటోన్మెంట్ జోన్లు ప్రకటించారు. కర్ణాటకలో నమోదైన కరోనా కేసుల్లో బెంగళూరులోనే అధిక శాతం కరోనా పాజిటివ్ (COVID-19) కేసులు నమోదు కావడం కలకలం రేపింది. గత 24 గంటల్లో బెంగళూరులో 925 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. బెంగళూరులోని 5 ప్రాంతాల్లోనే ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

బెంగళూరులో ఏం జరుగుతోంది ?
బెంగళూరు నగరంలో గత 10 రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వెలుగు చూడటంతో ప్రజలు హడలిపోయారు. విషయం తెలుసుకున్న బీబీఎంపీ కమిషనర్ మంజునాథ్ బెంగళూరులోని అన్ని వార్డుల్లోని ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో అత్యవసరంగా సమావేశం నిర్వహించి కరోనా పాజిటివ్ కేసుల వివరాలు తెలుసుకుంటున్నారు.

అధికారులు, ప్రజల వింత వాదన ?
బెంగళూరు నగరంలో కరోనా వైరస్ వ్యాధిని ప్రజలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రజలు గుమికూడి కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణం అవుతున్నారని ఆరోగ్య శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు వాదిస్తున్నారు. ఇలాంటి వింతవాదనలతో ఎవరి వాళ్లు పట్టించుకోకపోవడంతో బెంగళూరు సిటీలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయని సామాన్య ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క రోజులో హడలిపోయిన ప్రజలు
బెంగళూరు నగరంలో గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఐటీ హబ్ బెంగళూరులో ఇటీవల కాలంలో ఇన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. బెంగళూరు సిటీలో గత 24 గంటల్లో ఏకంగా 925 కరోనా పాజిటివ్ (COVID-19) కేసులు నమోదు కావడంతో ఇటు అధికారులతో పాటు సామాన్య ప్రజలు ఉలిక్కిపడ్డారు.

ఐదు కొత్త కంటోన్మెంట్ జోన్లు
బెంగళూరులో మొత్తం 198 బీబీఎ:పీ వార్డులు ఉన్నాయి. బెంగళూరులోని 10 వార్డుల్లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని అధికారులు గుర్తించారు. బెంగళూరులో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అధిక శాతం కరోనా పాజిటివ్ కేసులు ఈ పది వార్డుల్లోనే ఉన్నాయని అధికారులు గుర్తించారు. బెంగళూరులో కరోనా పాజిటివ్ కేసులతో బెళ్ళందూరు మొదటి స్థానంలో ఉండటంతో ప్రజలు హడలిపోతున్నారు. బెంగళూరులో కొత్తగా మరో ఐదు కంటోన్మెంట్ జోన్లు ప్రకటించారు.

దారావిలో ధారాలంగా కరోనా
ముంబాయి నగరంలోని దారావి మురికివాడలు (స్లమ్) ప్రాంతంలో గత 24 గంటల్లో ఓకేసారి 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇటీవల కాలంలో దారావి మురికివాడల్లో ఈ రెంజ్ లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని ముంబాయి కార్పోరేషన్ అధికారులు అంటున్నారు. ముంబాయి నగరంతో పాటు మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications