Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

COVID-19: లాక్ డౌన్ రూల్స్ బ్రేక్, హోటల్ లో అధికార పార్టీ ఎంపీ, సింగర్, కేసు పెట్టిన డెన్నీస్ !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ విదించిన ప్రభుత్వం కఠిన నియమాలు ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించిన సామాన్య ప్రజల మీద పోలీసులు కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ, సింగర్ కలిసి లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి అంటువ్యాదులు వ్యాపించడానికి కారణం అయ్యారని డెన్నీస్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

 బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య

బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య

బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఇటీవల అధికార పార్టీ తీరుపై పరోక్షంగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. బెంగళూరులో బెడ్ స్కామ్ దందాను వెలుగులోకి తీసుకు వచ్చి సొంత పార్టీలో హాట్ టాపిక్ అయ్యారు. కోవిడ్ రోగుల కోసం రిజర్వు చేసిన బెడ్ స్కామ్ దందా కేసు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

 బీజేపీ ఎంపీ లాక్ డౌన్ నియమాలు బ్రేక్

బీజేపీ ఎంపీ లాక్ డౌన్ నియమాలు బ్రేక్

బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. బెంగళూరు నగరంలోని నృపతుంగా రోడ్డులోని ప్రముఖ హోటల్ లో తేజస్వి సూర్య భోజనం చేశాడని బెంగళూరుకు చెందిన విజయ్ డెన్నీస్ బెంగళూరులోని హలసూరు గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 అందరికి ఒకే రూల్ కదా..... ఎంపీ ఏమైనా స్పెషల్ గా ఉన్నారా ?

అందరికి ఒకే రూల్ కదా..... ఎంపీ ఏమైనా స్పెషల్ గా ఉన్నారా ?

లాక్ డౌన్ జారీలో ఉన్న సమయంలో హోటల్స్ లో ఆహారం పార్శిల్ మాత్రమే తీసుకుని వెళ్లాలని, హోటల్ లో కుర్చుని ఆహారం సేవించరాదని, కనీసం టీకూడా తాగకూడదని కర్ణాటక ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే అధికార పార్టీ ఎంపీ తేజస్వి సూర్య ప్రముఖ గాయకుడు విజయ్ ప్రకాష్ తో కలిసి హోటల్ లో కుర్చని హ్యాపీగా భోజనం చేసి లాక్ డౌన్ నియమాలు తుంగలో తొక్కేశారని విజయ్ డెన్నీస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య, ప్రముఖ గాయకుడు విజయ్ ప్రకాష్ లాక్ డౌన్ సమయంలో హోటల్ లో కుర్చుని భోజనం చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన మీద సామాన్య ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఈ విషయంపై బెంగళూరు పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మీద ఫిర్యాదు చేశారని, అయితే ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, ఈ విషయం కోర్టు దృష్టికి తీసుకు వెలుతామని, న్యాయస్థానం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అంటున్నారు.

 అధికార పార్టీకి తలనొప్పి ?

అధికార పార్టీకి తలనొప్పి ?

కర్ణాటకలో అధికార పార్టీ ఎంపీ తేజస్వి సూర్య మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర ఆయన భార్యతో కలిసి లాక్ డౌన్ నియమాలు, కరోనా వైరస్ రూల్స్ బ్రేక్ చేసి మైసూరు సమీపంలోని ఓ దేవాలయంలో హోమాలు, ప్రత్యేక పూజలు చేశారని ఆరోపణలు వచ్చాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+