వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెర్డ్ ఇమ్యూనిటీతో కరోనా కట్టడి అసాధ్యం - మరణాలు పెరుగుతాయి - వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్న కేంద్రం

|
Google Oneindia TeluguNews

''కరోనా మహమ్మారికి పూర్తిగా అడ్డుకట్ట వేసేవి రెండే మార్గాలు. ఒకటి వ్యాక్సిన్‌. రెండు సమూహ రోగనిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ). 138 కోట్లతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన ఇండియాలో హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా వైరస్ కట్టడి అసాధ్యం. అది ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేయడంతోపాటు అధిక సంఖ్యలో మరణాలకు దారితీస్తుంది. కాబట్టి హెర్డ్ ఇమ్యూనిటీ ఇండియాకు ఆప్షన్ కానేకాదు''అని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

కొవిడ్-19 వ్యాక్సిన్ పై కేంద్రం గుడ్ న్యూస్ - 10లక్షలు దాటిన రికవరీలు - ఏపీ, తెలంగాణలో అనూహ్యం..కొవిడ్-19 వ్యాక్సిన్ పై కేంద్రం గుడ్ న్యూస్ - 10లక్షలు దాటిన రికవరీలు - ఏపీ, తెలంగాణలో అనూహ్యం..

దేశంలో కరోనాకు సంబంధించి కొత్తగా పాజిటివ్ కేసులు వెల్లువలా నమోదవుతుండటం, వ్యాక్సిన్ ప్రయోగాలు ఇంకా తుది దశకు చేరుకోని నేపథ్యంలో హెర్డ్ ఇమ్యూనిటీ విధానం వైపు మొగ్గుచూపాలనే వాదన మళ్లీ తెరపైకి రాగా, అత్యధిక జనాభా కలిగిన మన దేశానికి ఆ విధానం సరికాదని, వ్యాక్సిన్ ద్వారా మాత్రమే కరోనాను కట్టడి చేయగలమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మంగళవారం ఢిల్లీలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

covid-19: Herd immunity is not an option for India says union Health ministry

కొవిడ్-19 విరుగుడు కోసం దేశీయంగా రెండు రకాల వ్యాక్సిన్లు తయారయ్యాయని, వాటిలో మొదటిది ఫేజ్-1 దశలో, రెండోది ఫేజ్-2 దశల్లో ఉన్నాయని, మొదటి వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా దేశంలోని ఎనిమిది ప్రాంతాల్లో మొత్తం 1150 మందిపై డోస్ ప్రయోగించారని, ఇక రెండో వ్యాక్సిన్‌ను ఐదు ప్రాంతాల్లో వెయ్యి మందిపై ప్రయోగించారని, వాటి ఫలితాలు సానుకూలంగా వస్తే తరువాతి దశ ప్రయోగాలు చేపడతారని భూషణ్ వివరించారు.

హెర్డ్ ఇమ్యూనిటీ మనల్ని రోగం నుంచి పరోక్షంగానే రక్షిస్తుందని, అయితే, వ్యాక్సిన్‌ అభివృద్ధి అయినప్పుడు మాత్రమే ఇది మరింతగా పనిచేస్తుందని, లేదా వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య అయినా ఎక్కువగా ఉండాలని, ఏ రకంగా చూసినా, ఇండియాలో హెర్డ్ ఇమ్యూనిటీ ఓ ఆప్షన్ కాబోదని ఆయన చెప్పారు. కొవిడ్-19 మరణాల రేటు, రికవరీల్లో ఇండియా మెరుగ్గా ఉందని, ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ డెత్ రేటు 4 శాతం కాగా, అది ఇండియాలో 2.21 శాతం మాత్రమేనని, ఏప్రిల్ లో 7.4శాతంగా ఉన్న రికవరీ రేటు బాగా మెరుగుపడి ప్రస్తుతం 64.4 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే,

కేసీఆర్ - జగన్ కు కేంద్రం షాక్: జలవివాదాలపై అనూహ్య నిర్ణయం - నాలుగేళ్ల తర్వాత 5న అపెక్స్ భేటీ కేసీఆర్ - జగన్ కు కేంద్రం షాక్: జలవివాదాలపై అనూహ్య నిర్ణయం - నాలుగేళ్ల తర్వాత 5న అపెక్స్ భేటీ

కరోనా వైరస్ కు వ్యతిరేకంగా భారతీయుల్లో సామూహిక రోగనిరోధకశక్తిని (హెర్డ్‌ ఇమ్యూనిటీ) పెరుగుతున్నట్లు ఇటీవల కొన్ని సర్వేల్లో వెల్లడైంది. ప్రధానంగా ఢిల్లీ, ముంబై నగరాల్లో ఇది ఇలా జరుగుతున్నట్లు బయటపడింది. ముంబై సిటీలో మొత్తం జనాభా 1.85 కోట్లుకాగా, అందులో దాదాపు 40 శాతం మంది(సుమారు 74 లక్షల) మంది శరీరాల్లో కరోనా వ్యతిరేక ప్రతిరక్షకాలు (యాంటీబాడీలు) అభివృద్ధి చెందాయని బృహన్ ముంబై కార్పొరేషన్‌ చేపట్టిన 'సెరో-సర్వే'లో వెల్లడైంది.

English summary
Union Health Ministry on Thursday said that India cannot rely on herd immunity as a strategic option against Covid-19. adding that India can hope to achieve herd immunity only after a vaccine has been developed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X