వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో కరోనా: కొత్తగా 16,946 కేసులు, 198 మరణాలు - తొలిదశలో 1.65కోట్ల టీకా డోసులు

|
Google Oneindia TeluguNews

అమెరికా సహా పలు దేశాల్లో రెండో దశ కరోనా కేసులు విజృంభిస్తుండగా.. భారత్ లో మాత్రం వైరస్ విలయం కాస్త నిదానించింది. కొత్త కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈనెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుండటం ఇంకాస్త ఊరట కలిగించే అంశం. వివరాల్లోకి వెళితే..

కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,946 కేసులు, 198 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,12,093కు, మరణాల సంఖ్య 1,51,727కు పెరిగింది. గడిచిన ఆరు నెలకుగానూ, నిన్న నమోదైన మరణాలు 200 లోపు ఉండటం గమనార్హం. ఇక..

గుట్టు విప్పిన అఖిలప్రియ -గ్యాంగ్ సినిమా చూపించి -3రోజులు, 30గం, 300ప్రశ్నలు -మళ్లీ కోర్టుకుగుట్టు విప్పిన అఖిలప్రియ -గ్యాంగ్ సినిమా చూపించి -3రోజులు, 30గం, 300ప్రశ్నలు -మళ్లీ కోర్టుకు

covid-19: India reports 16,946 new cases 198 deaths in last 24 hours

కొత్త కేసుల కంటే తాజాగా రికవరీ అయినవారి సంఖ్య ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 17,652 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. తద్వారా దేశంలో రికవరీల సంఖ్య 1,01,46,763కు పెరిగింది. గురువారం నాటికి దేశంలో 2,13,603 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ లో పేర్కొంది. కరోనా మహమ్మారిని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా..

ఏపీ అభివృద్ధి కోసమే అప్పులు -చంద్రబాబు శాపనార్థాలే జగన్‌కు దీవెనలు :మంత్రి బొత్సఏపీ అభివృద్ధి కోసమే అప్పులు -చంద్రబాబు శాపనార్థాలే జగన్‌కు దీవెనలు :మంత్రి బొత్స

దేశంలో అత్యవసర వినియోగం నిమిత్తం కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లకు అనుమతిచ్చిన దరిమిలా వివిధ రాష్ట్రాలకు వాటి సరఫరా ఇప్పటికే వేగవంతమైంది. ఈ నెల 16న దేశవ్యాప్తంగా కరోనా టీకా ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తల డేటా ప్రకారం మొత్తం 1.65 కోట్ల కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ డోసుల టీకాలను రాష్ట్రాలకు పంపినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం వరుస ట్వీట్లు చేసింది.

English summary
India on Thursday reported 16,946 new Covid-19 cases, and 198 deaths in the last 24 hours, according to the Union Health Ministry.The total confirmed cases of coronavirus in India stands at 1,05,12,093 as of Thursday. Meanwhile, the death toll stands at 1,51,727.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X