• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా విలయం: భారత్ కొత్త రికార్డు -కేంద్రం తాజా లెక్కలివి -వ్యాక్సిన్ కంటే ముందే హెర్డ్‌ ఇమ్యూనిటీ

|

అంతూపొంతూ లేకుండా సాగిపోతున్న కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1.31లక్షల మందిని బలితీసుకుంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 5.5కోట్లకు చేరువైంది. అమెరికా, యూరప్ ఖండాల్లో కరోనా సెకండ్ వేవ్ అలజడి సృష్టిస్తోన్నవేళ.. జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత్ లో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోన్న సంకేతాలు వెలువడ్డాయి. కానీ ఇటీవలి పండుగ సీజన్ నేపథ్యంలో కొత్త కేసులు మళ్లీ పెరగొచ్చని తెలుస్తోంది. మరోవైపు హెర్డ్ ఇమ్యూనిటీపై ఎయిమ్స్ సంచలన ప్రకటన చేసింది..

  COVID-19 : Vaccine రాకముందే భారత్ లో ప్రజలు Herd Immunity ని పొందే అవకాశం ఉంది - AIIMS Director

  చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్ -క్వారంటైన్‌లో ఉండాల్సిందే -మెగాస్టార్ తొందరపడ్డారా?

  కొత్తగా 41,100 కేసులు..

  కొత్తగా 41,100 కేసులు..

  కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,100 కేసులు, 447 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88,14,579కు, మృతుల సంఖ్య 1,29,635 కి పెరిగింది. శనివారం ఒక్కరోజే 8,05,589 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్న ఐసీఎంఆర్.. దేశంలో ఇప్పటిదాకా 12,48,36,819 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. రికవరీల పరంగా భారత్ సరికొత్త రికార్డును నమోదు చేసింది.

  రికవరీల్లో రికార్డు..

  రికవరీల్లో రికార్డు..

  దేశంలో కరోనా విలయానికి సంబంధించి ఆరు నెలల తర్వాత కొత్త కేసుల సంఖ్యను రికవరీల సంఖ్య అధిగమించింది. గడిచిన నెల రోజులుగా కొత్త కేసులు తగ్గుతూ వచ్చినా, శనివారం మాత్రమే ఆ సంఖ్య రికవరీల కంటే తక్కువగా నమోదైంది. కేంద్రం లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 42, 156 మంది కొవిడ్ వ్యాధి నుంచి రికవరీ అయ్యారు. కొత్త కేసులు(41,100) కంటే రికవరీలు ఎక్కువ ఉండటం ఇటీవల ఇదే తొలిసారి. మొత్తం 88.14లక్షల కేసులకుగానూ ఆదివారం నాటికి వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 82,05,728కు పెరిగింది. ప్రపంచంలోనే అత్యధిక రికవరీ రేటు భారత్ లో ఉన్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4.79లక్షలుగా ఉంది. ఇకపోతే..

  16న జగన్ భవితవ్యం: తర్వాతి సీఎం ఎవరు? -సుప్రీం నోటీసులు -సాయిరెడ్డికి చుక్కలు: ఎంపీ రఘురామ

  వ్యాక్సిన కంటే ముందే ఇమ్యూనిటీ..

  వ్యాక్సిన కంటే ముందే ఇమ్యూనిటీ..

  కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికంటే ముందే భారత్ లో ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీని పొందే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ‘‘వ్యాక్సిన్ వచ్చేనాటికి భారత్ హెర్డ్ ఇమ్యూనిటీ(రోగనిరోధక శక్తి) దశకు చేరొచ్చు. అప్పుడు టీకాతో ప్రయోజనం ఉండదు. కాకుంటే, వైరస్ మార్పులు చెందితే.. రీ ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో వైరస్‌ స్పందించే తీరుపై ఎయిమ్స్ అంచనా వేస్తున్నది. దాని ఆధారంగా ఎంత తరచుగా టీకా తీసుకోవాల్సి ఉంటుందో అర్థమవుతుంది'' అని గులేరియా చెప్పారు.

  English summary
  India's Covid-19 tally surged to 88,14,579 with new 41,100 infections reported in the last 24 hours, the Union Health Ministry said on Sunday. With 447 new deaths, toll mounts to 1,29,635. daily new recoveries outpace new cases. Herd Immunity May Come Before Covid Vaccine Goes Off The Shelf says AIIMS Director
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X