కరోనాపై కేంద్రం గుడ్ న్యూస్ -70 శాతానికి పెరిగిన రికవరీ - 2 శాతానికి తగ్గిన మరణాలు
భారత్ లో కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వరుస చర్యల ఫలితంగా దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు పెరుగుతుండగా.. మరణాల రేటు కూడా భారీగా తగ్గుతున్నట్లు కేంద్రం ఇవాళ ప్రకటించింది. అటు ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను అభివద్ధి చేసినట్లు రష్యా ప్రకటన చేసిన రోజే కేంద్రం తాజా వివరాలను బయటపెట్టడంతో రోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 70 శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ ప్రకటించింది. గతంలో పోలిస్తే మరణాల రేటు కూడా తగ్గి ప్రస్తుతం 2 శాతం కంటే తక్కువగా నమోదవుతుందని అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 47,746 మంది రోగులు డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 15,83,489కి చేరుకుంది. అయితే గత 24 గంటల్లో 53 వేల కొత్త కేసులు నమోదైనట్లు ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించారు.
వీటితో పాటు 871 మరణాలు కూడా చోటు చేసుకున్నాయి.

ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 22,68,675 కాగా.. 45,257 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో పరిస్ధితిని నియంత్రించగలిగితే భారత్ కరోనా నుంచి బయటపడినట్లేనని ప్రధాని మోడీ ఇవాళ చేసిన ప్రకటన తాజా పరిస్ధితికి అద్దం పట్టేలే ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications