Bengaluru: ఐటీ హబ్ ఎఫెక్ట్, ఆ స్మశానవాటికలు క్లోజ్, శాంతించిన కరోనా, పచ్చిఅపద్దాలు, ప్రతిపక్షాలు !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలో కరోనా వైరస్ మహమ్మారి కొంచెం శాంతించినట్లు కనడుతోందని అధికారులు అంటున్నారు. గత రెండు నెలలతో పోల్చుకుంటే బెంగళూరులో కోవిడ్ మృతుల సంఖ్య చాలా తక్కువగా నమోదు అవుతోంది. ఇటీవల బెంగళూరు నగరంలో విపరీతంగా కోవిడ్ మరణాల సంఖ్య పెరిగిపోవడంతో బెంగళూరు నగర శివార్లో రెండు చోట్ల తాత్కాలిక స్మశానవాటికలు ఏర్పాటు చేశారు. బెంగళూరులో కోవిడ్ మృతుల సంఖ్య భారీ సంఖ్యలో తగ్గడంతో తాత్కాలిక స్మశానవాటికలు మూసివేస్తున్నామని BBMP కమీనర్ గౌరవ్ గుప్తా అన్నారు. అయితే ప్రభుత్వం దొంగ లెక్కలు చెబతూ వాస్తవాలు దాచిపెడుతోందని, బెంగళూరులో కోవిడ్ వ్యాధితో చాలా మంది చనిపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ సీఎం, విధానసౌధలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య మండిపడుతున్నారు.
Recommended Video

బెంగళూరులో స్మశానాలు హౌస్ ఫుల్
గత రెండు నెలల నుంచి బెంగళూరు నగరంలో ప్రతిరోజూ వందల సంఖ్యలో కోవిడ్ వ్యాధితో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. బెంగళూరు నగరంలోని స్మశాసవాటికలు పూర్తిగా ఫుల్ అయిపోయి అంత్యక్రియలు నిర్వహించడానికి మృతుల కుటుంబ సభ్యులు, బీబీఎంపీ అధికారులు, సిబ్బంది నానా ఇబ్బంది ఎదుర్కొన్నారు.

తాత్కాలిక స్మశానవాటికలు
బెంగళూరు నగరంలో విపరీతంగా కోవిడ్ మరణాల సంఖ్య పెరిగిపోవడంతో బెంగళూరు నగర శివార్లో రెండు చోట్ల తాత్కాలిక స్మశానవాటికలు ఏర్పాటు చేశారు. బెంగళూరు సిటీకి సుమారు 8 కిలోమీటర్ల దూరంలోని నెలమంగల సమీపంలో, తావరకెరె సమీపంలో తాత్కాలిక స్మశానవాటికలు ఏర్పాటు చేసి ఇంతకాలం కోవిడ్ మృతుల అంత్యక్రియలు నిర్వహించారు.

స్మశానవాటికలు క్లోజ్
బెంగళూరులో కోవిడ్ మృతుల సంఖ్య భారీ సంఖ్యలో తగ్గడంతో తాత్కాలిక స్మశానవాటికలు మూసివేస్తున్నామని BBMP కమీనర్ గౌరవ్ గుప్తా అన్నారు. బెంగళూరు నగరంలో ఇప్పుడు ప్రతిరోజు 40 నుంచి 50 మంది మద్యలో మరణిస్తున్నారని, సిటీలోని స్మశానవాటికల్లోనే వారి అంత్యక్రియలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బీబీఎంపీ కమీషనర్ గౌరవ్ గుప్తా మీడియాకు చెప్పారు.

బెంగళూరులో భారీగా తగ్గిన కోవిడ్ మరణాలు
బెంగళూరు నగరంలో మే 1 నుంచి జూన్ 8వ తేదీ వరకు మొత్తం 4, 675 మంది కోవిడ్ మహమ్మారికి బలి అయ్యారు. ఇప్పుడు రోజు సరాసరి 192 మంది చనిపోతున్నారని, అందులో బెంగళూరులో 50 మంది చనిపోతున్నారని, అందుకే తాత్కాలిక స్మశానవాటికలు పూర్తిగా మూసివేయాలని నిర్ణయించామని బీబీఎంపీ కమీషనర్ గౌరవ్ గుప్తా అంటున్నారు.

నోరు తెరిస్తే పచ్చి అపద్దాలు, మాయ చేస్తున్నారు: సిద్దూ
వాస్తవాలు దాచిపెట్టి ప్రజలను మోసం చెయ్యడానికి తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని, బీజేపీ నాయకులు నిద్రలేస్తే పచ్చి అపద్దాలు చెప్పి బతికేయాలని ఆలోచిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, విధానసౌధలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య కర్ణాటక ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. మొత్తం మీద అధికారుల లెక్కల ప్రకారం బెంగళూరులో కోవిడ్ మరణాలు భారీ సంఖ్యలో తగ్గాయని వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications