• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవిడ్: భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎందుకు గందరగోళంగా మారింది

By BBC News తెలుగు
|

దిల్లీలోని ఓ వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద బోర్డు

కోవిడ్ వ్యాక్సీన్ తీసుకోవడం కోసం కోవిన్ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి 31 ఏళ్ల స్నేహ మరాఠేకి ఒక పూట పట్టింది.

"ఇదంతా వేగంగా వేళ్లతో ఆడే ఆట" అని ఆమె అన్నారు. అందులో ఉన్న స్లాట్లన్నీ 3 సెకండ్లలోనే నిండిపోయాయి. కానీ, ఆఖరి నిమిషంలో ఆమె బుక్ చేసుకున్న హాస్పిటల్ ఆమె స్లాట్ రద్దు చేసింది. ఆమె మరో అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారు.

భారతదేశంలో వ్యాక్సీన్ తీసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిన్ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.

ఒక వైపు దేశంలో వ్యాక్సీన్ సరఫరా కంటే డిమాండు ఎక్కువగా ఉంది.

దాంతో, కొంత మంది టెక్ సావి భారతీయులు కొన్ని అంతు చిక్కని అపాయింట్‌మెంట్ల కోసం కోడ్ కూడా రాస్తున్నారు.

కరోనా వ్యాక్సీన్

అయితే, కోడ్ రాయడం రాని కొన్ని కోట్ల మంది భారతీయుల్లో మరాఠే ఒకరు. వ్యాక్సీన్ తీసుకోవడానికి ఏకైక మార్గంగా ఉన్న స్మార్ట్ ఫోను కానీ, ఇంటర్నెట్ సౌలభ్యం కానీ భారతదేశంలో కొన్ని లక్షల మంది ప్రజలకు అందుబాటులో లేదు.

అవసరమైనన్ని వ్యాక్సీన్ నిల్వలు లేకుండానే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 9.60 లక్షల అర్హులకు వ్యాక్సీన్ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు.

ఒక వైపు సెకండ్ వేవ్‌లో పెరుగుతున్న కేసులు, థర్డ్ వేవ్ తప్పదని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో వ్యాక్సీన్ కొరత కూడా వెంటాడుతోంది.

సరైన ప్రణాళిక లేకపోవడం, పీస్ మీల్ పద్ధతిలో వ్యాక్సిన్లను సేకరించడం, నియంత్రణ లేని ధరలు లాంటి తప్పిదాలతో మోదీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను గందరగోళంగా మార్చేసిందని వైద్య నిపుణులు బీబీసీతో అన్నారు.

సాధారణ ఔషధాలకు "ప్రపంచ ఔషధాగారం"గా చెప్పుకుంటూ ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో వ్యాక్సీన్లను ఉత్పత్తి చేస్తున్న దేశంలో టీకాల కొరత ఏర్పడింది.

కరోనా వ్యాక్సీన్

పీస్ మీల్ వ్యూహం

"భారతదేశానికి ముందుగానే వ్యాక్సీన్లు ఆర్డర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరి వరకు ఆర్డర్ చేయలేదు.

దాంతో పాటు, వ్యాక్సీన్లను కూడా చాలా తక్కువ మొత్తంలో సేకరించింది" అని యాక్సెస్ ఐబీఎస్ఏ కోఆర్డినేటర్ అచల్ ప్రభల చెప్పారు. ఈ సంస్థ భారతదేశానికి, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికాకు ఔషధాల కోసం ప్రచారం చేస్తుంది.

జనవరి నుంచి మే 2021 మధ్యలో భారతదేశం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా, భారత్ బయోటెక్ తయారు చేసిన సుమారు 3.50 కోట్ల వ్యాక్సీన్ డోసులను కొనుగోలు చేసింది.

కానీ, ఈ డోసులు కనీసం 20 శాతం జనాభాకు కూడా సరిపోవు.

కానీ "వ్యాక్సీన్ దౌత్యం"లో భాగంగా భారతదేశంలో మార్చి నెలలో ప్రజలకు వేసిన డోసుల కంటే ఎక్కువగా ఇతర దేశాలకు ఎగుమతి చేశారు.

అమెరికా యూరోపియన్ యూనియన్ మాత్రం వ్యాక్సీన్లు అందుబాటులోకి రాని సంవత్సరానికి ముందే అవసరమైన దాని కంటే ఎక్కువ ఆర్డర్లు పెట్టుకున్నారు.

"ఆర్డర్లు ముందుగా రావడంతో వ్యాక్సీన్ ఉత్పత్తిదారులకు సరఫరా, అమ్మకాల గురించి ఒక కచ్చితమైన మార్కెట్ ఉంటుందని అంచనా వేశారు. వ్యాక్సీన్లు సిద్ధం కాగానే కొన్ని దేశాలకు ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా వ్యాక్సీన్లను పంపేందుకు హామీ కూడా ఇచ్చారు" అని ప్రభల అన్నారు.

భారతదేశం మాత్రం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ వ్యాక్సీన్ ఉత్పత్తిని పెంచడానికి 610 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేస్తామని ఏప్రిల్‌లో ప్రకటించింది.

భారతదేశంలో ఉన్న విస్తృతమైన ఉత్పత్తి సంస్థల సామర్ధ్యాన్ని వ్యాక్సీన్ ఉత్పత్తికి కేటాయించకపోవడం కూడా మరో పెద్ద వైఫల్యమని అల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్‌వర్క్ కో కన్వీనర్ మాలిని ఐసోలా అన్నారు.

తిరిగి కోవాక్సీన్ తయారు చేసేందుకు నాలుగు సంస్థలకు ఆమోదం తెలిపారు. అందులో మూడు ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న సంస్థలు. వీటికి పాక్షికంగా ప్రభుత్వ నిధులు ఇస్తారు.

మరో వైపు భారతదేశంలో స్పుత్నిక్ వ్యాక్సీన్ తయారు చేసేందుకు రష్యా కూడా ఇండియాకు చెందిన కొన్ని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

కరోనా వ్యాక్సీన్

దెబ్బతిన్న మార్కెట్

మే 1 నుంచి రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు ఎవరికి వారే వ్యాక్సీన్ ఉత్పత్తిదారులతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో వ్యాక్సీన్ ధర పెరిగిపోయింది.

కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి వైదొలిగిందని, ఇది మోసమని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఇది రాష్ట్రాల మధ్య ఇబ్బంది పెట్టే పోటీతత్వాన్ని పెంచిందని ఆరోపణలు వినిపించాయి.

రాష్ట్రాలు వ్యాక్సీన్ కొనుగోలు చేయడానికి కేంద్రం కంటే రెట్టింపు సొమ్ము ఇచ్చి ఖరీదు చేయాలి. ప్రైవేటు హాస్పిటళ్లతో పాటు రాష్ట్రాలు కూడా వ్యాక్సీన్ కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నాయి.

ప్రభుత్వ, ప్రైవేటు నిధులతో తయారు చేసిన వ్యాక్సిన్లకు ఫ్రీ మార్కెట్ సృష్టించారు. ప్రైవేటు హాస్పిటళ్లలో ఒక సింగిల్ డోసుకు 1500 రూపాయిలు ఖర్చు అవుతుంది.

https://twitter.com/malini_aisola/status/1391106197101576193

చాలా రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి ఫైజర్, మోడెర్నా, జాన్సన్ & జాన్సన్ వ్యాక్సీన్లను దిగుమతి చేసుకోవడానికి ప్రణాళికలు ప్రకటించాయి.

కానీ, ఇప్పటివరకు ఏ ఉత్పత్తిదారు కూడా రానున్న కొన్ని నెలల్లో వ్యాక్సీన్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వలేదు. ధనిక దేశాలు వ్యాక్సీన్లను ముందుగానే ఆర్డర్ చేసుకున్నాయి.

స్పుత్నిక్-వి వ్యాక్సీన్ కోసం ఆమోదం లభించింది.

ప్రభుత్వ నిధులు జారీ చేసిన తర్వాత కూడా వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థలు మహమ్మారి సమయంలో లాభాలను ఆర్జించడం కోసం చూస్తున్నాయని కొంత మంది ఆరోపించారు.

సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ వాటి ఉత్పత్తి ధరలు, వాణిజ్య ఒప్పందాల గురించి మరింత పారదర్శకంగా ఉండాలని ప్రజారోగ్య నిపుణులు అంటున్నారు.

కరోనా వ్యాక్సీన్

భారత్‌లో వ్యాక్సీన్ ధర ఎక్కువా?

సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ కోవాక్స్ పథకం, గేట్స్ ఫౌండేషన్ నుంచి తీసుకున్న 300 మిలియన్ డాలర్లను ఎలా ఖర్చుపెట్టిందో బహిర్గతం చేయాలని ఐసోలా అన్నారు. ఈ నిధులను పేద దేశాలకు వ్యాక్సీన్ తయారు చేసేందుకు ఇచ్చారు.

భారతదేశం ఎగుమతులను నిషేధించడంతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వివరాలను వెల్లడి చేయక పోవడానికి ఒక కారణం కావచ్చు.

ఎస్ఐఐ తమ ఉత్పత్తిలో 50 శాతం పేద దేశాలకు పంపే హామీని నిలబెట్టుకోలేకపోయినందుకు ఆస్ట్రాజెనెక నుంచి చట్టపరమైన సవాళ్ళను కూడా ఎదుర్కొంటోంది.

భారత ప్రభుత్వం భారత్ బయోటెక్ తో చేసుకున్న ఒప్పందాన్ని కూడా పరిశీలించాలని ప్రజారోగ్య నిపుణులు కోరుతున్నారు.

ముఖ్యంగా ఆ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవ్యాక్సీన్ మేధో హక్కులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా అభివృద్ధి చేసిందని ప్రకటించినప్పటి నుంచి ఈ డిమాండు చేస్తున్నారు. ఈ సంస్థ ఉత్పత్తి చేసే వ్యాక్సీన్ డోసు ఖరీదు కోవిషీల్డ్ కంటే రెట్టింపు ధరలో ఉంది.

"వాళ్ళు మేధో హక్కులను పంచుకుంటామని చెబుతున్నారు. కానీ, అదెటువంటి ఒప్పందం? ఒక వేళ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధిస్తే ఆ ఒప్పందంలో ఉన్న నిబంధనలను ఉల్లఘించే హక్కు ఉంటుందా?" అని ప్రజారోగ్య నిపుణులు డాక్టర్ అనంత్ భన్ ప్రశ్నించారు.

అయితే, విదేశాల్లో తయారైన వ్యాక్సీన్ల పై పేటెంట్లను తొలగించేందుకు ప్రభుత్వం మద్దతు ఇచ్చినప్పటికీ , కోవాగ్జిన్ విషయంలో మాత్రం అలాంటి ప్రయత్నాలేమీ జరగలేదు.

వ్యాక్సీన్ల ఉత్పత్తికి తప్పనిసరిగా లైసెన్సు , మిగిలిన ఫార్మా సంస్థలు కూడా ఆమోదం పొందిన వ్యాక్సీన్లను ఉత్పత్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్షాలు చేసిన సూచనలను కూడా ప్రభుత్వం తిరస్కరించింది.

ఈ సమయంలో మిగిలిన ఫార్మా సంస్థలకు వ్యాక్సీన్ తయారీకి కావల్సిన సాంకేతికతను బదిలీ చేయడం, సామర్ధ్యాన్ని పెంపొందించడానికి సమయం పడుతుందని డాక్టర్ భన్ అంగీకరించారు. ఇదంతా ముందే ఎందుకు చేయలేదో అర్ధం కావటం లేదని అన్నారు.

"భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభాలో కనీసం 70 శాతానికి వ్యాక్సీన్ ఇవ్వాలన్నా కూడా ప్రణాళిక చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది. కానీ, భారతదేశం గతంలో చేసిన వ్యాక్సినేషన్ ప్రక్రియ అనుభవంతో ఇది సాధ్యం కాని పనేమీ కాదు" అని డాక్టర్ భన్ అన్నారు.

కానీ, వ్యాక్సీన్ సరఫరా ధరలను నిర్ణయిస్తున్న రెండు సంస్థలనే ప్రభుత్వం ఎందుకు ఎన్నుకుందనేదానికి మాత్రం సమాధానం కొంత మంది దగ్గరే ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid: Why the vaccination process in India has become confusing
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X