
బంగారం గొలుసు మింగేసిన ఆవు.. పేడలో వెతికినా దొరకలేదు.. ఏం చేశారంటే.. - ప్రెస్ రివ్యూ

కర్ణాటకలో ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఒక ఆవు బంగారు గొలుసు మింగేసిందని వెలుగు పత్రిక ఒక కథనం రాసింది.
ఆ కథనం ప్రకారం.. పండుగ పూట ఇంట్లో పూజ చేసి ఆవుకు పూలు, పండ్లు తినిపించారు. పూలదండలు, నగలు వేసి అలంకరించారు.
పూజ పూర్తయిన తర్వాత చూస్తే బంగారు గొలుసు కనిపించలేదు. కర్ణాటకలోని సిర్సి తాలుకాలో ఈ ఘటన జరిగింది.
హీపనహళ్లీలో ఉంటున్న శ్రీకాంత్ హెగ్డేకు ఒక ఆవు, దూడ ఉన్నాయి. దీపావళికి ముందు రోజు శ్రీకాంత్ కుటుంబం తమ ఆవు, దూడలను పూలు, నగలతో అలంకరించింది.
పూజ చేసి నైవేద్యంతో పాటు పూలను వాటికి తినిపించారు. ఆ తర్వాత దూడకు అలంకారం కోసం పెట్టిన బంగారు గొలుసు కనిపించలేదు. ఎంత వెతికినా దొరకకపోవడంతో ఆవు మింగేసి ఉంటుందని, కొన్ని రోజులు దాని పేడలో వెతికారు. కానీ గోల్డ్ చైయిన్ దొరకలేదు.
ఆ తర్వాత ఆవును వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్ ఆవుకు స్కానింగ్ చేశారు. బంగారు గొలుసు దాని పొట్టలోనే ఉన్నట్లు స్కానింగ్‌లో తేలింది. చైన్ ఉన్న భాగాన్ని గుర్తించిన తర్వాత సర్జరీ చేసి దాన్ని వెలికి తీశారు.
ప్రస్తుతం ఆవు ఆరోగ్యంగానే ఉందని పశువైద్యుడు చెప్పారు.

దేశం అప్పు రూ.1,35,86,975 కోట్లు
భారత దేశ అప్పు గత 70 ఏళ్లలో 5.29 లక్షల శాతం పెరిగిందని ఈనాడు ఒక కథనం రాసింది.
ఆ కథనం ప్రకారం.. 1950-51లో దేశం నికర అప్పు రూ. 2,565.40 కోట్లు ఉండగా 2021-22 నాటికి అది రూ.1,35,86,975.52 కోట్లకు చేరింది.
సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ సహ చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
2014-15 నాటికి దేశ నికర అప్పు రూ.62,42,220.92 కోట్లు ఉండగా 2021-22 బడ్జెట్ నాటికి అది రూ.1,35,86,975.52 కోట్లకు చేరింది. ఏడేళ్లలో 117 శాతం పెరిగింది.
64 ఏళ్లలో దేశం రుణం రూ.62.42 లక్షల కోట్ల మేర ఉండగా గత ఏడేళ్లలోనే కొత్తగా రూ.73,44,754 కోట్ల అప్పు చేసినట్లు ఈ సమాచారం ద్వారా వెల్లడైంది.
1950-51లో దేశ అంతర్గత రుణం రూ.2022.30 కోట్లు. విదేశీ రుణం రూ.32.03 కోట్ల మేర ఉండగా 2021-22 నాటికి అంతర్గత రుణం రూ.1,13,57,415 కోట్లు, విదేశీ రుణం రూ.4,27,925.24 కోట్లకు ఎగబాకింది.
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
- పాకిస్తాన్: పాత అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు చేయాల్సి వస్తోందా

ఎంపీల రాజీనామాకు మేం సిద్ధం మీరు రెడీనా: చంద్రబాబు
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సీఎం జగన్ తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలి. వైసీపీ తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తే మేం కూడా మా ఎంపీలతో రాజీనామా చేయిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది.
దాని ప్రకారం.. తమకు ప్రజలు పాతిక మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఇప్పుడు ఎందుకు కిక్కురునమనడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు.
''ఒక్క హోదానే కాదు, విభజన సమయలో నాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ జగన్‌రెడ్డి పాలనలో నీరుగారిపోతున్నాయి'' అని ఆయన విమర్శించారు.
''పాతిక మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగివచ్చి హోదా ఇచ్చి తీరుతుందని జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. హోదా వస్తే రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రం హైదరాబాద్ స్థాయికి చేరుతుందని, రాష్ట్రానికి హోదా వచ్చి తీరాలని కోరారు.
అందుకనే ఇప్పుడు అడుగుతున్నాం. వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలి. మేం అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీకి సొంతంగానే మెజారిటీ ఉంది. అయినా, మేం మా కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి పోరాడాం. అదే పని ఇప్పుడు ఎందుకు చేయరు? మీ ఎంపీలతో రాజీనామా చేయిస్తారా? లేదా? అన్నదానిపై సీఎం సూటిగా సమాధానం చెప్పాలి'' అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
విశాఖ రైల్వే జోన్‌పై కూడా జగన్‌రెడ్డి మడమ తిప్పారని ఆరోపించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం విషయంలో కూడా ద్రోహపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

నేటి నుంచి విధుల్లోకి సింగరేణి కార్మికులు
తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు గురువారం మొదలుపెట్టిన సమ్మె శనివారం రాత్రి షిఫ్టుతో ముగిసిందని సాక్షి పత్రిక కథనం ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం.. జేవీఆర్ ఓసీ-3, శ్రావణపల్లి, కోయగూడెం బ్లాక్-3, కేకే-6 ఇంక్లైన్ బొగ్గుబ్లాక్‌లను వేలం నుంచి తొలగించి, సింగరేణికే అప్పగించాలన్న కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్‌పై హైదరాబాద్‌లోని రీజినల్ లేబర్ కమిషనర్ వద్ద శనివారం సాయంత్రం మరోసారి చర్చలు జరిగాయి.
ఈ అంశం కేంద్రం పరిధిలోనిదని, కేంద్రం విధానపర నిర్ణయం తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుందని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది.
ఢిల్లీ వెళ్లి ఈ అంశంపై సంబంధిత శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇతర ప్రముఖులను కలసి నివేదిస్తామని కార్మిక సంఘాల జేఏసీ పేర్కొనగా, దానికి అవసరమైన సహకారం అందిస్తామని యాజమాన్యం పేర్కొంది.
మిగతా డిమాండ్లను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కేంద్ర కార్మికశాఖ అధికారులు, రీజినల్ లేబర్ కమిషనర్ సూచించగా, వచ్చే నెల 20న మరోసారి సమావేశం కావాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.
సమ్మె వల్ల రోజుకు 1.5 లక్షల టన్నుల చొప్పున 4.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని, రూ.120 కోట్ల ఆదాయానికి గండిపడిందని సింగరేణి యాజమాన్యం వెల్లడించింది.
ఈ లోటును పూడ్చుకుంటూ నిర్దేశిత రోజువారీ లక్ష్యాలను సాధించేందుకు కార్మికులు, అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చింది. ఆదివారం సెలవుదినం అయినప్పటికీ ఉపరితల గనుల నుంచి ఉత్పత్తి, రవాణాను కొనసాగించాలని నిర్ణయించింది.
సెలవుదినానికి సంబంధించిన పని నిబంధనల్లో స్వల్ప మార్పులు చేస్తూ కార్మికులను విధులకు ఆహ్వానించింది. సెలవురోజు విధులకు అనుమతిస్తే రెండు మస్టర్ల జీతం లభిస్తుంది. అయితే సెలవు రోజు పనిచేయడానికి వారంలో కనీసం నాలుగు రోజులు విధులకు హాజరై ఉండాలి. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల నిబంధనను యాజమాన్యం రెండురోజులకు సవరించింది.
ఇవి కూడా చదవండి:
- NFTs : బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో పనిచేసే ఈ డిజిటల్ అసెట్స్ గురించి తెలుసా? - డిజిహబ్
- టోర్నడో బీభత్సం.. అమెరికాలో 70 మందికి పైగా మృతి
- జనరల్ బిపిన్ రావత్ అనంతరం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయ్యేదెవరు, అర్హతలేమిటి
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- అంకోర్ సామ్రాజ్యం అభివృద్ధి, అంతం రెండిటికీ నీరే కారణమా
- బుద్ధుడి గురించి ఈ విషయాలు తెలుసా?
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్