EVM: ఎన్నికల్లో ఈవీఎంను బ్యాన్ చేయాలి.. నారాయణ డిమాండ్..
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై అభ్యంతరాలు పెరుగుతోన్నాయి. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ భారత్ లో ఈవీఎంను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరు గురించి చర్చించాల్సి అవసరం ఉందని అన్నారు. చాలా దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతాయని గుర్తు చేశారు. జపాన్, అమెరికాలో ఈవీఎంలను బ్యాన్ చేశారని తెలిపారు. ఈవీఎంలు బ్యాన్ చేసే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల వరకు దేశంలో ఈవీఎంలో బ్యాన్ చేయాలన్నారు.
సెంట్రల్ గర్నమెంట్ చర్చలు జరిపి ఈవీఎంలును బ్యాన్ చేయాలని కోరారు. అయితే ఎన్నికల్లో ఈవీఎంల వాడాకంపై ఎన్న సందేహాలు ఉన్నాయి.ముంబైలో గెలిచిన శివసేన అభ్యర్థి బంధువుల వద్ద EVM "అన్‌లాక్" చేసిన ఫోన్ ఉందని పేర్కొన్న వార్తలు వచ్చాయి. దీనిపై ఎన్నికల అధికారులు స్పందించారు.ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వందనా సూర్యవంశీ మాట్లాడుతూ, ఈవీఎం అనేది స్వతంత్ర వ్యవస్థ అని, దానిని అన్‌లాక్ చేయడానికి OTP అవసరం లేదని అన్నారు.

జూన్‌లో జరిగిన ఓట్ల లెక్కింపు సందర్భంగా కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించిన శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్ బంధువు గురించి మిడ్-డే వార్తాపత్రికలో వచ్చిన కథనానికి పోల్ ఆఫీసర్ స్పందించారు. "ఈవీఎంను అన్‌లాక్ చేయడానికి మొబైల్‌లో OTP (వన్-టైమ్ పాస్‌వర్డ్) లేదు, ఎందుకంటే ఇది ప్రోగ్రామ్ చేయదగినది కాదు. దీనికి వైర్‌లెస్ కమ్యూనికేషన్ సామర్థ్యాలు లేవు" అని సూర్యవంశీ చెప్పారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 499, 505 ప్రకారం పరువు నష్టం, తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు గాను మిడ్-డే వార్తాపత్రికకు నోటీసులు జారీ చేసినట్లు ఆమె తెలిపారు.
ఈవీఎంలు తమ సిస్టమ్ వెలుపలి యూనిట్లతో వైర్డు లేదా వైర్‌లెస్ కనెక్టివిటీ లేకుండా స్వతంత్ర పరికరాలు అని పోలింగ్ అధికారి పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4న కౌంటింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్‌ను ఉపయోగించారనే ఆరోపణలపై వైకర్ బావ మంగేష్ పాండిల్కర్‌పై బుధవారం కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications