వెంటిలేటర్‌పై సీతారాం ఏచూరి
Sitaram Yechuri: సీపీఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా తెలుస్తోంది. గురువారం రాత్రి నుంచి వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తోన్నారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సీతారాం ఏచూరి ఇటీవలే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. న్యమోనియా తరహా ఇన్‌ఫెక్షన్ వల్ల కొంతకాలంగా అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఊపిరితిత్తుల సంబంధిత ఇబ్బందుల బారిన పడ్డారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కిందటి నెల 19వ తేదీ నాడే ఎయిమ్స్‌లో చేరారు. చికిత్స తీసుకుంటోన్నారు.

అప్పటి నుంచి ఆరోగ్యం స్థితిలో ఎలాంటి మార్పూ ఉండట్లేదు. గురువారం రాత్రి ఆరోగ్యం మరింత క్షీణించింది. శ్వాస తీసుకోలేకపోవడంతో హుటాహుటిన ఆయనను ఐసీయూకు తరలించారు. వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్ ఇస్తోన్నారు. ఊపిరితిత్తుల స్పెషలిస్ట్‌లతో కూడిన ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తోంది.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై కిందటి నెల 31వ తేదీన సీపీఎం ఓ ప్రకటన విడుదల చేసింది. లంగ్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 19వ తేదీన ఆసుపత్రిలో అడ్మిట్ అయిన విషయాన్ని నిర్ధారించింది. ప్రత్యేక డాక్టర్ల పర్యవేక్షణలో కొనసాగుతున్నటలు తెలిపింది.
1952లో సీతారాం ఏచూరి చెన్నైలో జన్మించారు. హైదరాబాద్‌లో చదువుకున్నారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వెళ్లిన తరువాత ఎస్‌ఎఫ్ఐలో చేరారు. 1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. క్రమంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. వామపక్ష పార్టీల్లో కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు.












Click it and Unblock the Notifications