Crime: ఉద్యోగం చేస్తున్న భార్య మీద డౌట్, పెళ్లామ్ ను ఏం చెయ్యలేక 8 ఏళ్ల కూతురి మీద పగ !
చెన్నై/మదురై: కుటుంబ సభ్యులు కుదిర్చిన వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమార్తె ఉంది. భర్త టైలర్ పని చేస్తున్నాడు. భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భార్య బయట ఉంటోంది. భార్య తీరుతో అనుమానం వచ్చిన భర్త ఆమెతో గొడవపడుతున్నాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త రగిలిపోయి రచ్చరచ్చ చేశాడు. భర్త గొడవ చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోని భార్య ఆమెపని ఆమె చేసుకుంటున్నది. దంపతుల ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇంటిలో 8 ఏళ్ల అమ్మాయి కాళ్లు, చేతులు కట్టేసి చంపేసి బకెట్ లో వేశారని, శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తోందని తెలుసుకున్న స్థానికులు హడలిపోయారు.

సంతోషంగా కాపురం చేశాడు
తమిళనాడులోని మదురైలోని జైహింద్ పురంలో కాళిముత్తు అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు కుదిర్చిన ప్రియదర్శిని అనే యువతిని కాళిముత్తు వివాహం చేసుకున్నాడు. కాళిముత్తు, ప్రియదర్శిని దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు.

ఉద్యోగం చేస్తున్న భార్య
కాళిముత్తు, ప్రియదర్శిని దంపతులకు 8 సంవత్సరాల వయసు ఉన్న కుమార్తె ఉంది. కాళిముత్తు జైహింద్ పురంలోనే టైలర్ పని చేస్తున్నాడు. కాళిముత్తు భార్య ప్రియదర్శిని కీజవాసల్ ప్రాంతంలోని ఓ దుకాణంలో సేల్స్ గర్ల్ గా ఉద్యోగం చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రియదర్శిని షాపులోనే ఉంటోంది.

భార్యకు అక్రమ సంబంధం ఉందని ?
ఉద్యోగం చేస్తున్న భార్య ప్రియదర్శిని మీద కాళిముత్తుకు అనుమానం మొదలైయ్యింది. ప్రియదర్శిని తీరుతో అనుమానం పెంచుకున్న కాళిముత్తు ఆమె చాలా కాలం నుంచి గొడవపడుతున్నాడు. తన భార్య ప్రియదర్శిని వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఉద్యోగం చేసే ముసుగులో అతనితో తిరుగుతోందని కాళిముత్తు రగిలిపోయాడు.

బకెల్ లో శవమైన కూతురు
భర్త కాళిముత్తు గొడవ చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోని అతని భార్య ప్రియదర్శిని ఆమెపని ఆమె చేసుకుంటున్నది. సెప్టెంబర్ 23వ తేదీన కాళిముత్తు ఇంటి నుంచి దుర్వాస వస్తున్న విషయం గుర్తించిన జైహింద్ పురం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటికి వెళ్లి పరిశీలించగా కాళిముత్తు కూతురు బకెట్ లో శవమై కనిపించింది.

భార్య మీద కసితో కూతుర్ని చంపేశాను
8 ఏళ్ల అమ్మాయి కాళ్లు, చేతులు కట్టేసి చంపేసి బకెట్ లో వేశారని, శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తోందని తెలుసుకున్న స్థానికులు హడలిపోయారు. కూతుర్ని చంపేసి అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న కాళిముత్తు గురువారం రాత్రి పోలీసులకు చిక్కిపోయాడు.

ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేదు
తన భార్య ప్రియదర్శిని అక్రమ సంబంధం పెట్టుకుందని కోపంతో కూతుర్ని తానే చంపేశానని, తరువాత రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందామని వెళ్లానని, ధైర్యం లేకపోవడంతో అటూఇటూ తిరుగుతున్నానని కాళిముత్తు అంగీకరించాడని మదురై పోలీసులు తెలిపారు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో కన్న కూతురిని తండ్రి దారుణంగా హత్య చెయ్యడం మదురైలో కలకలం రేపింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications