• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విమర్శల వెల్లువ: ఆ చట్టం ఉల్లంఘించినందుకు కేసులు.. అదేశాఖకు మంత్రిగా ఆనంద్ సింగ్

|

బెంగళూరు: కర్నాటక అటవీశాఖ మంత్రిగా గతవారం యడ్యూరప్ప క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న కాంగ్రెస్ మాజీ నేత ఆనంద్ సింగ్‌పై విమర్శలు వస్తున్నాయి. తనపై అన్ని అటవీశాఖ ఉల్లంఘన చట్టం కింద పలు కేసులు ఉండగా అదే శాఖను కేటాయించడంపై విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. అయితే తనపై ఉన్న కేసులను సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఆనంద్ సింగ్. ముఖ్యమంత్రి యడియూరప్ప తనకు ఆ శాఖను కేటాయించారని అతని నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆనంద్ సింగ్ చెప్పారు.

ఆనంద్ సింగ్‌పై పలు అక్రమ మైనింగ్ కేసులు ఉన్నాయి. ఆనంద్ సింగ్ అతని కుటుంబ సభ్యులకు బళ్లారిలో మైనింగ్‌ లీజులు ఉన్నాయి. ఈ క్రమంలోనే అక్రమమైనింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు ఆనంద్ సింగ్‌పై వచ్చాయి. అయితే తనపై వచ్చిన కేసులు రాజకీయంగా పెట్టినవే అని చెప్పారు ఆనంద్ సింగ్. అదే సమయంలో తనపై నేరుగా పెట్టిన కేసులు కాదని సంస్థల్లో భాగంగా తనపై కేసులు పెట్టారని వివరణ ఇచ్చారు. తనపై ఉన్న కేసులకు సంబంధించి జాబితా ఇస్తానని ఆనంద్ సింగ్ తెలిపారు. అటవీశాఖ చట్టం ఉల్లంఘన కింద తనపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ఒకటి ఉండేదని అది కూడా సుప్రీంకోర్టు కొట్టేసిందని చెప్పారు.

Criticism shoots up on Forest Minister Anandsingh for allocating portfolio despite cases

వాల్మీకీ లాంటి వారిపైనే ఎన్నో ఆరోపణలు వచ్చాయని కానీ తను రామాయణం లాంటి మహాగ్రంథాన్ని రాశారని చెప్పిన ఆనంద్ సింగ్... తప్పు చేసినవారు ఎప్పటికీ మారకూడదా అని ప్రశ్నించారు. తన కుటుంబం వ్యాపారం చేస్తుందని అయితే అది కుటుంబ వ్యాపారమని చెప్పారు. అందులో తను ఎక్కడా ప్రొప్రెయిటర్‌గా లేరని చెప్పుకొచ్చారు. కారు నడుపుతున్న వ్యక్తి పై కేసు నమోదైతే అది కారు ఓనరుకు ఎలా అంటగడతారని ప్రశ్నించారు. ఇక అటవీశాఖ మంత్రిగా కొనసాగడమా లేదా అనేది తన నిర్ణయం కాదని ముఖ్యమంత్రితో పాటు ఇతర పార్టీ నేతలు చర్చించాకే జరుగుతుందని వెల్లడించారు.

ఇక తనపై 11 కేసులున్నాయని మీడియా ముందు ప్రదర్శించారు ఆనంద్ సింగ్. అన్ని కేసులు 2014-15 మధ్య లోకాయుక్త నమోదు చేసిన కేసులని చెప్పారు. అయితే ఈ కేసులన్నిటిపై హైకోర్టు స్టే ఇచ్చిందని గుర్తుచేశారు. ఇక సీబీఐ కూడా పలు కేసులు నమోదు చేసిందన్న ఆనంద్ సింగ్ ప్రస్తుతం అవి విచారణలో ఉన్నాయని చెప్పారు. ఇక 15వ కేసుపై బళ్లారిలోని హోస్పేట్ జిల్లా కోర్టు స్టే ఇచ్చిందని చెప్పారు. ఇదిలా ఉంటే 2013లో అక్రమ మైనింగ్‌ల కేసులను విచారణ చేసిన లోకాయుక్త మాజీ జస్టిస్ సంతోష్ హెగ్డే.... ఆనంద్ సింగ్ అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం దురదృష్టం అని వ్యాఖ్యానించారు.

అటవీశాఖ కేసులున్న వ్యక్తికి అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారా అన్న సంతోష్ హెగ్డే ఇక తనపై ఉన్న కేసులు ముందుకు ఎలా వెళతాయని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ అని అభివర్ణించారు. అందుకే ఎవరికి ఓటు వేస్తున్నామా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఓటు వేయాలని జస్టిస్ సంతోష్ హెగ్డే అన్నారు.

English summary
Amid mounting outrage over his appointment as forest minister, Anand Singh stuck to his guns on cases against him under the Karnataka Forest Act, saying the portfolio has been given to him by Chief Minister Yediyurappa and he would abide by what the CM says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X