CRPF Jawan: ఇద్దరు సహోద్యోగులను చంపి.. తనను తాను కాల్చుకున్న జవాన్

CRPF Jawan: మణిపూర్ లో ఇంఫాల్ లో సీఆర్పీఎఫ్ శిబిరంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఒక సీఆర్పీఎఫ్ జవాన్ తన ఇద్దరు సహోద్యోగులను చంపి.. ఆపై తనను కాల్చుకున్నాడు. ఈ సంచలనాత్మక ఘటన గురువారం రాత్రి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) శిబిరంలో జరిగింది. సమాచారం ప్రకారం.. ఓ సైనికుడు తన ఇద్దరు సహచరులను విచక్షణారహితంగా కాల్చి చంపి.. ఆపై తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది సైనికులు గాయపడ్డారు. ఇంఫాల్ పశ్చిమ జిలా పరిధిలోని లాంఫెల్ లో సీఆర్పీఎఫ్ శిబిరంలో రాత్రి 8.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని సైనిక వర్గాలు తెలిపాయి. ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ దాడి వ్యక్తిగత వివాదం నుంచి ఉద్భవించిందని భావిస్తున్నారు. ఈ ఘటనకు కచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి, హింసకు దారితీసిన అంశాలను వెలికితీసేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నిందితుడైన సైనికుడు సంజయ్ కుమార్ 120వ బెటాలియన్ కు చెందిన హావల్దార్. అతను అకస్మాత్తుగా తన సర్వీస్ రివాల్వర్ తో కాల్పులు జరపడం ప్రారంభించాడు. అతను మొదట ఒక కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపగా.. వారిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. దీని తర్వాత నిందితుడు కూడా తనను తానూ కాల్చుకున్నాడు. ఈ దాడిలో మొత్తం 8 మంది సైనికులు కూడా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ వెంటనే ఇంఫాల్ లోని రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(RIMS)లో చేర్చారు. వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు కారణం త్వరలోనే వెల్లడిస్తామని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ కేసు వెనుక గల కారణం స్పష్టంగా తెలుస్తుందని వెల్లడించారు. సీనియర్ సీఆర్పీఎఫ్ అధికారులు శిబిరానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

CRPF Jawan Kills Two Colleagues and Shoots Himself in Manipur
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+