బీఎండబ్ల్యూ కారుతో మూడుసార్లు తొక్కించి.. సీఎం సమీప బంధువు దారుణ హత్య
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సమీప బంధువును అతని స్నేహితులు దారుణంగా చంపారు. బీఎండబ్ల్యూ కారుతో మూడుసార్లు తొక్కించడంతో ఆయనపై తీవ్రంగా గాయపడి మరణించారు.
చండీగఢ్: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సమీప బంధువును అతని స్నేహితులు దారుణంగా చంపారు. బీఎండబ్ల్యూ కారుతో మూడుసార్లు తొక్కించడంతో ఆయనపై తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ దారుణం చండీగఢ్ లో జరిగింది.
వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ కు మేనల్లుడు ఆకాంశ్ సేన్(28) బుధవారం అర్ధరాత్రి లేట్ నైట్ పార్టీలో పాల్గొన్నాడు. గురువారం తెల్లవారుజామున పార్టీలో స్నేహితులతో గొడవ పడ్డాడు.
ఇద్దరు స్నేహితులు.. ఆకాంశ్ ను కొట్టి, బీఎండబ్ల్యూ కారును అతడిపై నుంచి మూడుసార్లు పోనిచ్చారు. ఈ ఘటనలో ఆకాంశ్ ను కారు 50 మీటర్ల దూరం లాక్కెళ్లింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆకాంశ్ ను అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు.

తీవ్రంగా గాయపడిన ఆకాంశ్ ను చాలా ఆలస్యంగా గుర్తించారు. శుక్రవారం చండీగఢ్ లోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ హత్య కేసులో నిందితులను హర్మితాబ్ సింగ్ ఫరీద్, బలరాజ్ సింగ్ రంధావాలుగా గుర్తించామని, ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
మరోవైపు పోలీసుల విచారణ తీరుపై వీరభద్ర సింగ్ కుటుంబ సభ్యులు విమర్శించారు. హత్య జరిగి 24 గంటలు గడిచినా పోలీసులు నిందితులను అరెస్టు చేయాలేదని వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు.
సీఎం వీరభద్ర సింగ్ మాట్లడుతూ... తాను పంజాబ్ గవర్నర్ తో మాట్లడానని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరానని, నిందితులు దేశం విడిచి పారిపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పానని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని చండీగఢ్ వచ్చారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications