వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్‌లో మోసం: మొబైల్ ఆర్డర్ ఇస్తే పార్సిల్లో రాయి వచ్చింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో మొబైల్ ఫోన్ కోసం బుకింగ్ ఆర్డర్ చేయగా, శుక్రవారం నాడు అతనికి పార్సిల్‌లో ఓ రాయి వచ్చింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. సదరు వ్యక్తి ఈ విషయాన్ని కంపెనీ దృష్టికి తీసుకు వెళ్లగా.. వారు డబ్బులు ఇవ్వలేకపోయారు.

దీంతో అతను పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘజియాబాద్‌కు చెందిన బసంత్ శర్మ మొబైల్ కోసం ఆన్ లైన్‌లో ఆర్డర్ చేశారు.

తనకు మొబైల్ ఫోన్‌కు బదులు రాయి రావడాన్ని గుర్తించిన బసంత్ శర్మ... పార్సిల్ తీసుకు వచ్చిన డెలివరీ బాయ్‌ను ప్రశ్నించాడు. తనకు ఏ విషయం తెలియదని చెప్పాడు. అంతేకాదు, పార్సిల్ కోసం బసంత్ చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వడం కూడా జరగదని చెప్పాడు.

Customer gets stone in packet, instead of mobile!

బసంత్ శర్మ నిలదీయడంతో సదరు డెలివరీ బాయ్... డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని బుకాయించాడు. అయితే, తనకు అలాంటిది ఏమీ జరగకపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బసంత్ శర్మ ఓ కార్ షోరూంలో పని చేస్తున్నాడు. అతను మే 11వ తేదీన మొబైల్ కోసం ఆర్డర్ చేశాడు. శుక్రవారం పార్సిల్‌లో మొబైల్ బదులు రాయి వచ్చింది. ఆ మొబైల్ కోసం అతను రూ.1580 పే చేశాడు.

English summary
A man who had ordered a mobile from an online portal on Friday opened the package to find a stone, and filed a case when the company refused to return the money he paid, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X