Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. విదేశీ మహిళ అరెస్ట్

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డగ్స్ పట్టుపడింది. ఉగాండా నుంచి వచ్చిన మహిళ అనుమానాస్పదంగా కన్పించడంతో కస్టమ్స్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఆమె నుంచి రూ 14.14 కోట్ల విలువైన హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్ట్ చేసిన విచారిస్తున్నారు.

ఎయిర్‌పోర్టులో హెరాయిన్

ఎయిర్‌పోర్టులో హెరాయిన్


ఉగాండా దేశానికి చెందిన ఓ మహిళ దుబాయి మీదుగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. అనుమానస్పదంగా కనిపిస్తుండడంతో కస్టమ్స్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఆమె లగేజీని తనిఖీ చేశారు. బ్యాగ్‌లో వైట్‌క‌లర్‌తో ఉన్న పౌడర్ గుర్తించారు. పరీక్షించగా అది హెరాయిన్‌గా తేలింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు .

 ఉగాండా మ‌హిళ అరెస్ట్

ఉగాండా మ‌హిళ అరెస్ట్

ప‌ట్టుబ‌డిన హెరాయిన్ మొత్తం 2020 గ్రాములు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు . దాని విలువ సుమారు రూ.14.14 కోట్ల ఉంటుందని పేర్కొన్నారు. మహిళను నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్పోక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌ 1985 కింద అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఆమెను విచారిస్తున్నారు.

రూ.15వేల కోట్ల విలువైన మాదకద్రావ్యాలు స్వాధీనం

రూ.15వేల కోట్ల విలువైన మాదకద్రావ్యాలు స్వాధీనం

దేశ వ్యాప్తంగా ఈ ఏడాది రూ.15వేల కోట్ల విలువైన మాదకద్రావ్యాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఢిల్లీ ఎయిర్ పోర్టులోను 100 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ .700 కోట్లకు పైగా ఉంటుందని అధికారుల తెలిపారు. ఈ ఏడాది 26 మందిని ఢిల్లీ విమానాశ్రయంలోనే అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వీరంద‌రిని మారకద్రవ్యాలను తరలిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. ఎయిర్ పోర్టులో అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంటున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

పాకిస్తాన్ పడవలో డ్రగ్స్

పాకిస్తాన్ పడవలో డ్రగ్స్


గుజరాత్ లో భారీగా మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు అధికారులు. పాకిస్తాన్ కు చెందిన పడవలో తరిస్తున్నట్లు సమాచారం రావడంతో భారత తీరరక్షణ దళం , గుజరాత్ ఏటీఎస్ అధికారుల సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి వీరిని పట్టుకున్నారు. పడవలో తరలిస్తున్న 77 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.400 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. పడవలో ఉన్న ఆరుగురుని అరెస్ట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+