20మంది మహిళల హత్య: సైనెడ్ మోహన్‌కు ఊరిశిక్ష

ఇతనికి మంగళూరు జిల్లా సెషన్స్ న్యాయస్థానం శనివారం ఉరిశిక్ష విధించింది. 2005 నుంచి 2009 వరకు ఉత్తర కన్నడ జిల్లాలతోపాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలలో 20 మంది మహిళలను మోహన్ హతమార్చాడు. సైనెడ్ మోహన్ అసలు పేరు మోహన్ కుమార్. ఇతను వ్యాయామ ఉపాధ్యాయు డిగా పని చేసేవాడు.
వివాహమైన మరునాడే గర్భనిరోధక మాత్ర పేరిట సైనేడ్ గుళిక ఇచ్చి ప్రాణం తీస్తూ, ప్రేమ విఫలమై ఆ మహిళలు ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబసభ్యులు, పోలీసులు భావించేలా చేసేవాడు. 2009లో మోహన్ చేతిలో హతమైన అనిత కేసు విచారణలో పోలీసులు ఆమె సెల్‌ఫోన్ ఆధారంగా అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకురాగలిగారు. దీంతో మోహన్‌ను అరెస్ట్ చేశారు.
అతనిపై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి కావడంతో శనివారం న్యాయమూర్తి మోహన్‌కు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పు ప్రకటించారు. చివరగా ఏమైనా కోర్టుకు చెప్పుకోవచ్చని న్యాయమూర్తి సూచన మేరకు తన కుటుంబానికి దిక్కులేదని, వృద్ధురాలైన తల్లి ఉందని వారందరినీ పోషించాల్సిన బాధ్యత తనపై ఉందని శిక్షలు లేకుండా చూడాలని మోహన్ వేడుకున్నాడు.
అందుకు తీవ్రంగా స్పందించిన జడ్జి 20 మంది మహిళలను దారుణంగా హత్య చేసినప్పుడు తప్పు చేస్తున్నట్లు ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. మోహన్ కేసు తుది విచారణ విషయం ముందుగానే తెలుసుకున్న జిల్లావాసులు పెద్ద ఎత్తున కోర్టుకు వచ్చారు. మోహన్‌ను కోర్టు నుంచి జైలుకు తరలించే సమయంలో తాను సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నట్లు అతను విలేకరులకు తెలిపాడు.












Click it and Unblock the Notifications