మీ సైట్లు జరభద్రం - దేశ వ్యాప్తంగా సైబర్ దాడులు : రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..!!

దేశ వ్యాప్తంగా అనేక వెబ్‌సైట్లు హ్యాక్ అవుతున్నాయి. అనేక సైబర్ ముఠాలు మన దేశంలోని వెబ్‌సైట్లను టార్గెట్ చేసాయి. గడిచిన ఆరు రోజుల్లోనే 1,400 వరకూ వెబ్​సైట్లు హ్యాకింగ్​కు గురయ్యాయి. మహారాష్ట్ర, రాజస్థాన్‌, దిల్లీలకు చెందిన వివిధ వెబ్‌సైట్లు ఇప్పటికే హ్యాక్‌ అయినట్లు సమాచారం. దీంతో.. కేంద్రం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తొలుత కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిధిలోని సైట్లను లక్ష్యంగా చేసుకున్నా..ఇప్పుడు పలు రాష్ట్రాలకు చెందిన వాటిని టార్గెట్ చేస్తున్నారు.

సైబర్ ముఠాల టార్గెట్

సైబర్ ముఠాల టార్గెట్

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా సైబర్‌ ముఠాలు ఈ హ్యాకింగ్ కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దేశంలోని పలు వెబ్ సైట్లపైన మూకుమ్మడిగా దాడికి పాల్పడుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో..కేంద్రం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ సమాచారం పంపింది. ప్రభుత్వంతో పాటుగా ప్రైవేటు వెబ్ సైట్లను వదలటం లేదు. డ్రాగన్‌ఫోర్స్‌ మలేసియా అనే ముఠా భారత ప్రభుత్వంపై డిజిటల్‌ యుద్ధం ప్రకటించింది. రోజుకు సుమారు 200 వెబ్‌సైట్లు ఈ సైబర్‌ ముఠాల బారిన పడుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు.

రాయబార కార్యాలయంలోనూ హ్యాకింగ్

రాయబార కార్యాలయంలోనూ హ్యాకింగ్

ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసిన నేరగాళ్లు వందల సంఖ్యలో పాస్‌పోర్ట్‌ల వివరాలు చోరీ చేసినట్లు సమాచారం. కేంద్రానికి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సూచనలు చేస్తోంది. పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకూ అప్రమత్తంగా ఉండటంతో పాటుగా..అదనపు భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. ఇక, ఇదే సమయంలో సైబర్‌ నేరగాళ్ల ముఠాలు సామాజిక మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టేలా దుష్ప్రచారం చేస్తున్నాయి.

రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

దీంతో..ఈ వ్యవహారంలో అవసరమైన విధంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు చేస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో సైట్లు హ్యాకింగ్ కు అవుతున్న సమాచారంతో కీలక సంస్థలు అప్రమత్తం అవుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ప్రముఖ పేమెంట్‌ గేట్‌వే గురువారం హ్యాకింగ్‌కు గురైంది. ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న అనేక ఈ కామర్స్‌ సంస్థల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో..ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే, పూర్తి అప్రమత్తతతో ఉండాల్సిన సమయంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+