Cyber Crime: దేశంలో పెరుగుతోన్న సైబర్ క్రైమ్స్.. బాధితుల్లో మహిళలే ఎక్కువ..!
టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ వాడకం పెరగడం దీనికి కారణమని చెబుతున్నారు. ఆన్ లైన్ బ్యాంకింగ్, మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులు చేస్తున్నప్పుడు చాలా మంది సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు డేటా స్టీలింగ్ తో ఆన్ లైన్ ఆర్థిక నేరాలకు పాల్పడుతూ బాధితుల ఖాతాలను మోసగాళ్లు ఖాళీ చేస్తున్నారు.
మోసపోయే వారిలో చదువుకున్న వారు కూడా ఉన్నారు. పోలీసులు, సీబీఐ,బ్యాంకు ఉద్యోగుల పేర్లతో పోన్లుచేయడం.. బాధితులను బెదిరించి డబ్బులు ఖాతాల్లోకి మళ్లించుకోవడంవంటి సైబర్ నేరాలు ఇటీవల భారీగా పెరిగాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా కూడా ఎక్కువగా మోసం చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోలకు లైక్ లు కొడితే డబ్బులు ఇస్తామని చెప్పి చాలా మందిని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు.

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (NCRB) 2022 నేరాలకు సంబంధించిన గణాంకాలను వెల్లడించింది. గతం కంటే క్రైం రేటు తగ్గినప్పటికీ.. సైబర్ క్రైం గణనీయంగా పెరిగిందని వివరించింది. ఇందులో 65 శాతం ఆన్ లైన్ మోసాలకు సంబంధించినవేనని పేర్కొంది. సైబర్ క్రైం బాధితుల్లో అన్ని వర్గాలు ఉన్నవారు ఉన్నప్పటికీ ఎక్కువగా మహిళలే ఉన్నారని వివరించింది. బాధితుల్లో 25 శాతం మహిళలే వివరించింది.
వైట్ కాలర్ నేరాలుగా చెప్పుకునే సైబర్ ఆర్థిక నేరాలు దేశవ్యాప్తంగా 11.1 శాతం పెరిగాయని వివరించింది. 2022లో 1 లక్షా 93 వేల కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications