వీడు పోలీస్ ఇన్స్ పెక్టర్ కు మూడు నామాలు, బ్యాంకు ఖాతా జీరో, లక్షల్లో లూటీ !

బెంగళూరు/హెబ్బళి: సైబర్ క్రైమ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలే కాదు, పోలీసు అధికారులు కూడా సైబర్ మోసానికి గురవుతున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలోని హుబ్బళి-ధారవాడ జంట నగరాల్లోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ గా పని చేస్తున్న పోలీసు అధికారి స్వయంగా వెళ్లి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ధారవాడలోని సబర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దయానంద్ షేగుణసి అలియాస్ దయానంద్ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 8.25 లక్షలు ఆయనకు తెలియకుండానే ఆన్‌లైన్‌లో వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ అయ్యాయి. ఇన్‌స్పెక్టర్ దయానంద్ హుబ్బళి నగరంలోని సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు.

 Cybercriminals who transferred Rs 8 lakhs in police inspectors bank account to other peoples accounts

పోలీస్ ఇన్స్ పెక్టర్ దయానంద్ ఆయన వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోనప్పటికీ ఆయన బ్యాంకు ఖాతాలోని డబ్బు బదిలీ చేశారని పోలీసులు అంటున్నారు. సురక్షితంగా ఉండే నెట్ బ్యాంకింగ్ సెక్యూరిటీని ఉపయోగించకుండా నగదు బదిలి అయ్యే అవకాశం లేదని కొందరు అంటున్నారు. బ్యాంకు అధికారుల కొందరి నిర్లక్ష్యం కారణంగానో లేకుంటే కొంతమంది అధికారుల జోక్యంతోనో గుర్తు తెలియని వ్యక్తి ద్వారా డబ్బు బదిలీ చేయబడిందని ఆరోపలు ఉన్నాయి.

 Cybercriminals who transferred Rs 8 lakhs in police inspectors bank account to other peoples accounts

బ్యాంకు ఖాతాలకు లింక్ చేసిన మొబైల్ ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ అయ్యాయని పోలీసులు అంటున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ 50 వేలు చొప్పున 12 సార్లు, రూ 45 వేలు మూడు సార్లు, రూ 25 వేలు చొప్పున రెండు సార్లు పోలీస్ ఇన్స్ పెక్టర్ బ్యాంకు ఖాతా నుంచి ఇతరుల ఖాతాలకు బదిలీ చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 Cybercriminals who transferred Rs 8 lakhs in police inspectors bank account to other peoples accounts

ఈ విషయంపై స్వయంగా ఇన్ స్పెక్టర్ దయానంద్ సైబర్ క్రైం స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. బ్యాంకులోని కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందా ? లేక కొత్త తరహా సైబర్ క్రైమ్ పుట్టుకొచ్చిందా అనే అనుమానం కలుగుతోందని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+