శభాష్ నవీన్ పట్నాయక్: కరోనా కాలంలో తుఫాన్ సహాయక చర్యలు భేష్..

యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ కలవరపెడుతోంది. సెకండ్ వేవ్ మరీ ఇబ్బందికి గురిచేస్తోంది. ఇలా ఉంటే ఇటీవల వచ్చిన యాస్ తుపాన్ అల్లకల్లోలం చేసింది. సైక్లోన్ ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదే ఉంది. అయితే ఇంతటి క్లిష్ట సమయంలో కూడా ఒడిశా సర్కార్ సమర్ధవంతంగా పనిచేసింది. తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించింది. ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట చర్యలను తీసుకుంది. ప్రకృతి విపత్తును మరోసారి ధైర్యంగా ఎదుర్కొని.. ఎదురొడ్డి నిలిచింది.

కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోన్న ఈ తరుణంలో తుపాన్ నివారణ చర్యలు చేపట్టడం సాహసంతో కూడిన చర్య. తుపాన్ రావడంతో వాయు వేగంతో సహాయక చర్యలను చేపట్టారు. సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బృందం చాలానే శ్రమించింది. తీర ప్రాంతంలో ఉన్న వారిని వాయు వేగంతో తరలించింది. 48 గంటల్లో 3 వేల షెల్టర్లకు 7 లక్షల మందిని తరలించింది అంటే అదీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సహాయక పనుల్లో కూడా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించి.. వైరస్ విస్తరించకుండా ప్రీకాషన్స్ తీసుకున్నారు. చాలా సందర్భాల్లో శానిటైజర్ రాసుకుంటూ మరీ తమ పనిని కొనసాగించారు.

cyclone acts are nice in corona pandemic in odisha

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్, కేంద్రపడ, భద్రక్, బాలాసోర్,, మయూర్‌బాంగ్ జిల్లాలపై తుపాన్ ప్రభావం చూపించింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. జగ్ పూర్, కటక్, కోర్దా, పూరీ, దెనకనల్, కియోన్‌హర్‌లో గాలులతో కూడిన వర్షం పడింది. ఈ సమయంలో గర్భవతులు, దివ్యాంగులకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఇంతటి క్లిష్ట సమయంలో 750 మంది జన్మించారు. 2100 మంది గర్భవతులను ఆస్పత్రులకు తరలించారు.

24 గంటల్లో 104 ఎమర్జెన్సీ అంబులెన్స్ ద్వారా 3349 మంది రోగులను తరలించారు. ఆ సమయంలో భారీగా ఈదురుగాలులు వీయడంతోపాటు వర్షం కూడా పడింది. వీరిలో 879 మంది బాలాసోర్‌, భద్రక్, మయూర్ బాంగ్, కేంద్రపర, జగత్‌సింగ్ పూర్‌కి చెందిన వారు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+